Anasuya : స్టార్ హీరోకి అత్తగా అనసూయ..!

Anasuya : బుల్లితెర యాంకర్ అనసూయ ఇప్పుడు మాంచి ఫుల్ జోష్ లో ఉంది. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ఇండియా పుష్పలో దాక్షాయని అనే పవర్ఫుల్ పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం అరడజన్ సినిమాలతో అనసూయ బిజీగా ఉంది. ఈ కమంలో ఓ స్టార్ కి అనసూయ అత్తగా నటించనుందని తెలుస్తోంది.
రవితేజ హీరోగా 'ఖిలాడి' అనే సినిమా తెరకెక్కుతోంది. రమేష్ వర్మ దర్శకుడు.. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఇందులో ఒకరికి అనసూయ తల్లిగా నటిస్తుందట.. ఇందులో ఆమె పాత్ర పేరు చంద్రకళ అని సమాచారం.
హీరోయిన్‌కు తల్లి అంటే.. హీరో అయిన రవితేజకు అత్త కూడా అన్నట్టు.. ఈ సినిమాలో అనసూయ డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో బ్రహ్మణ యువతిగా ఓ రోల్ ఉంటుందని, మరో పాత్ర వెరీ పవర్ఫుల్ గా ఉంటుదని ఫిల్మ్ నగర్ లో టాక్.
కాగా ఈ సినిమాని ఈ నెల 11వ తేదీన విడుదల చేయనున్నారు. సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com