Anasuya Bharadwaj: అనసూయ షాకింగ్ లుక్స్.. సోషల్ మీడియాలో వైరల్..

Anasuya Bharadwaj: అవకాశం ఇవ్వాలేగానీ అన్ని పాత్రలు చేసేస్తాను అనే టైప్ కాదు అనసూయ. తన పాత్రకు తగిన ప్రాధాన్యం ఉంటేనే సైన్ చేస్తుంది.. అందుకే ఏరి కోరి ఎంచుకున్న పాత్రలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెడుతున్నాయి. రంగస్థలంలో రంగమ్మత్తగా అదరగొట్టినా, పుష్పలో ద్రాక్షాయిణిగా దడపుట్టించినా అది అనసూయకే చెల్లింది.
బుల్లి తెరపై పొట్టి దుస్తుల్లో కవ్వించినా సినిమాల్లో పవర్‌ఫుల్ క్యరెక్టర్లు ఎంచుకుని తానేంటో తెలియజేస్తోంది. వరుస సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న అనసూయ తాజాగా ఓ మూవీకి సంబంధించిన చిత్రంలో ఆమె లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా, నటి రెజీనా ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రంలో అనసూయ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.. ఫోటోలు చూస్తుంటే ఆమె రోల్‌కి ఉన్న ప్రాధాన్యత అర్థమవుతోంది. ఆ సినిమాలో ఆమె రోల్ ఏంటి.. ఆమె పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com