Anasuya Bharadwaj: యంగ్ డైరెక్టర్‌తో అనసూయ.. ప్రయోగాత్మక చిత్రంలో..

Anasuya Bharadwaj (tv5news.in)
Anasuya Bharadwaj: అటు బుల్లితెరను, ఇటు వెండితెరను మ్యానేజ్ చేస్తూ.. కెరీర్‌లో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది అనసూయ భరద్వాజ్. ఇప్పటివరకు తాను పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించడం మాత్రమే కాకుండా.. ఒకట్రెండు సినిమాల్లో లీడ్ రోల్ కూడా చేసింది. ఇప్పుడు మరోసారి ఓ యంగ్ డైరెక్టర్ సినిమాలో లీడ్ రోల్ చేయడానికి రెడీ అయ్యింది.
పలు షార్ట్ ఫిల్మ్స్‌ను తెరకెక్కించి మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న జయశంకర్.. పేపర్ బాయ్ చిత్రంతో ఫీచర్ ఫిల్మ్‌కు డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. మొదటి చిత్రంతోనే ఫీల్ గుడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ ఓ ప్రయోగాత్మక కథను సిద్ధం చేస్తున్నాడట. అంతే కాకుండా ఇదొక లేడీ ఓరియెంటెడ్ కథ అని సమాచారం. ఈ కథకు అనసూయనే కరెక్ట్ అని తనను సంప్రదించగా తాను కూడా హీరోయిన్‌గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
అనసూయ, జయశంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు 'గ్రహమ్' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా దీనికి అనూప్ సంగీత దర్శకుడిగా ఎంపికయినట్టు సమాచారం. ఇతర మ్యూజిక్ డైరెక్టర్ల తాకిడితో కాస్త వెనకబడిన అనూప్.. ఇప్పుడిప్పుడే మళ్లీ ఫార్మ్‌లోకి వస్తున్నాడు. ఇప్పుడు అనసూయ నటించే లేడీ ఓరియెంటెడ్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికవ్వడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com