Anasuya Bharadwaj: 'ఇది ఉమెన్స్ డే కాదు.. ఫూల్స్ డే'.. మరో కాంట్రవర్సీలో అనసూయ

Anasuya Bharadwaj (tv5news.in)

Anasuya Bharadwaj (tv5news.in)

Anasuya Bharadwaj: ఈరోజు ప్రతీ ట్రోలర్, మీమ్ మేకర్ ఉన్నట్టుండి మహిళలను గౌరవించే రోజు అని నేను ఇప్పుడే గుర్తించారు.

Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ.. బుల్లితెరపైనే కాదు.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అంతే కాకుండా తనకు అనిపించింది చెప్పడంలో ఎప్పుడూ వెనకాడదు. అలా చాలా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది అనసూయ. నేడు అందరూ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటుంటే.. ఉమెన్స్ డే పైనే సంచలన ట్వీట్ చేసి మరోసారి హాట్ టాపిక్‌గా మారింది అనసూయ.


అనసూయపై సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. దీనిపై ఎన్నిసార్లు తాను ఘాటుగా స్పందించినా.. ఈ ట్రోలింగ్ మాత్రం ఆగట్లేదు. పైగా తన డ్రెస్సింగ్ స్టైల్ గురించి కామెంట్ చేసే వారికి కూడా ఎప్పటికప్పుడు గట్టిగా సమాధానం చెప్పడం అనసూయకు అలవాటు. అలాంటి అనసూయ.. తాజాగా ఉమెన్స్ డే సందర్భంగా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.


'ఈరోజు ప్రతీ ట్రోలర్, మీమ్ మేకర్ ఉన్నట్టుండి మహిళలను గౌరవించే రోజు అని నేను ఇప్పుడే గుర్తించారు. అయినా ఇదంతా 24 గంటల్లో ముగిసిపోతుంది. అందుకే ఇది నమ్ముతున్న మహిళలు అందరికీ హ్యపీ ఫుల్స్ డే' అని ట్వీట్ చేసింది అనసూయ. ఈ ట్వీట్‌పై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అనసూయ చెప్పినదాంట్లో తప్పేముంది అని కొందరు.. ఫూల్స్ అనడం కరెక్ట్ కాదు అని మరికొందరు వారి అభిప్రాయన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story