Anasuya : ఆ సినిమాలో అనసూయ డ్యూయల్ రోల్... !

Anasuya : ఆ సినిమాలో అనసూయ డ్యూయల్  రోల్...  !
Anasuya : బుల్లితెరకి గ్లామర్ అద్దిన అతికొద్దిమంది యాంకర్ లలో అనసూయ ఒకరు.. జబర్దస్త్ షోతో ఒక్కసారిగా పాపులరైన ఆమె..

Anasuya : బుల్లితెరకి గ్లామర్ అద్దిన అతికొద్దిమంది యాంకర్ లలో అనసూయ ఒకరు.. జబర్దస్త్ షోతో ఒక్కసారిగా పాపులరైన ఆమె.. ఆ తర్వాత వెండితెర పై ఎంట్రీ ఇచ్చి... మంచి మంచి పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌‌లో జెట్ స్పీడ్‌‌గా దూసుకుపోతోంది. తాజాగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో దాక్షాయణి అనే ఓ పాత్రలో మెరిసి ఆకట్టుకుంది ఈ బ్యూటీ.

ఇప్పుడు రవితేజ హీరోగా వస్తోన్న ఖిలాడి సినిమాలో ఓ కీరోల్ ప్లే చేస్తోంది. అయితే ఇందులో అనసూయ డ్యూయల్ రోల్ అని తెలుస్తోంది. అందులో ఒక పాత్రలో బ్రహ్మణ యువతిగా అనసూయ కనిపించనుందట. రెండో పాత్ర కాస్త పవర్‌ఫుల్ పాత్ర అని తెలుస్తోంది. సినిమాలో ఓ పాత్ర చూస్తుండగానే చనిపోతుందట.. మరో పాత్ర సినిమా చివరి వరకు కొనసాగుతుందని తెలుస్తోంది.

అనసూయ డ్యూయల్ రోల్ అనడంతో సినిమా పైన మరింత ఆసక్తి పెరిగింది. రమేష్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. డింపుల్ హయాతి, మీనాక్షి చైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story