Anasuya First Look From Pushpa: గర్వం, అహంకారం కలిపితే ఆమె.. పుష్ప నుండి అనసూయ ఫస్ట్ లుక్ విడుదల..

Anasuya First Look From Pushpa: గర్వం, అహంకారం కలిపితే ఆమె.. పుష్ప నుండి అనసూయ ఫస్ట్ లుక్ విడుదల..
Anasuya First Look From Pushpa: పాన్ ఇండియా సినిమా పుష్పలో ప్రతీ ఒక్క అంశం ప్రేక్షకులకు సర్ప్రైజ్‌గానే ఉంది.

Anasuya First Look From Pushpa: పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న పుష్పలో ప్రతీ ఒక్క అంశం ప్రేక్షకులకు సర్ప్రైజ్‌గానే ఉంది. ఫస్ట్ లుక్స్ దగ్గర నుండి పుష్పను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నాం అనే వార్త వరకు అన్నీ ఒక రకంగా ప్రేక్షకులకు షాకే. బన్నీని ఇప్పటివరకు స్టైలిష్ స్టార్‌గానే చూశారు అభిమానులు. అలాంటి బన్నీ స్టైల్‌నే పుష్ప కోసం పూర్తిగా మార్చేశాడు సుకుమార్. తాజాగా విడుదలయిన అనసూయ ఫస్ట్ లుక్ కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది.

క్షణం సినిమాతో యాంకర్ నుండి నటిగా టర్న్ అయిన అనసూయ.. మొదటి సినిమాలోనే విలన్‌గా మంచి పేరును సంపాదించుకుంది. ఆ తర్వాత తన నటనకు తగ్గ పాత్రలేవీ తనకు దక్కలేదు. సుకుమార్ దర్శకత్వంలో అనసూయ నటించిన రంగమ్మత్త పాత్ర అనసూయ కెరీర్‌కు పెద్ద బ్రేక్. రంగస్థలంలో సమంతను మాత్రమే కాదు అనసూయను కూడా డీ గ్లామర్ రోల్‌లోనే చూపించాడు సుకుమార్.

రంగస్థలం తర్వాత పుష్పతో మరోసారి అనసూయ, సుకుమార్ చేతులు కలుపుతున్నారు. పుష్పలో కూడా సుకుమార్.. అనసూయకు రంగమ్మత్త లాంటి పాత్ర ఇస్తాడని ఊహించిన ప్రేక్షకులకు ఈ ఫస్ట్ లుక్ పెద్ద షాక్‌నే ఇచ్చింది. హెయిర్ కట్‌తో కిల్లీ నములుతూ అనసూయ సీరియస్ లుక్ కొత్తగా ఉంది. దాక్షాయణిగా అనసూయ ఈసారి తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేయనుందని అర్థమవుతోంది.

గర్వం, అహంకారం మనిషిలాగా మారితే దాక్షాయణి అంటూ పుష్ప టీమ్.. అనసూయ పాత్రకు ఇంట్రడక్షన్ కూడా ఇచ్చింది. ఇప్పటివరకు వచ్చిన కథనాల ప్రకారం మంగళం శ్రీను పాత్రలో నటిస్తున్న సునీల్‌కు భార్య పాత్రలో అనసూయ కనిపించనుందట. వీరిద్దరి సీరియస్ లుక్స్ చూస్తుంటే ఈ రూమర్స్ నిజమేనేమో అనిపిస్తోంది. ఫస్ట్ లుక్స్‌తోనే వందకు వంద మార్కులు కొట్టేస్తున్న సుకుమార్ పుష్పతో రికార్డులు బ్రేక్ చేస్తాడన్న అభిప్రాయంతో ఉన్నారు అభిమానులు.


Tags

Next Story