19 Aug 2022 9:45 AM GMT

Home
 / 
సినిమా / Anasuya Bharadwaj :...

Anasuya Bharadwaj : అనసూయపై విరుచుకుపడ్డ నెటిజన్లు..

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ తాజాగా చేసిన ట్వీట్లు వివాదం సృష్టిస్తోంది.

Anasuya Bharadwaj : అనసూయపై విరుచుకుపడ్డ నెటిజన్లు..
X

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ తాజాగా చేసిన ట్వీట్లు వివాదం సృష్టిస్తోంది. ఆమె నిన్న కేటీఆర్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేయడంతో ఈ రచ్చ మొదలైంది. గుజరాత్‌ బిల్కిస్ బానో పై సామూహిక అత్యచారం కేసులో అరెస్టయిన దోషులను హైకోర్టు విడుదల చేసింది. ఆ దోషులకు ఓ సంస్థ పూలమాలలతో సన్మానం చేసింది. ఇదే విషయాన్ని కేటీఆర్ పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించేవారు గుజరాత్‌లో ఏమి జరుగుతుందో చూడాలని ట్వీట్ చేశారు. ఇదే ట్వీట్‌ను అనసూయ రీట్వీట్ చేసింది. వెంటనే నెటిజన్లు ఆమెపై ట్వీట్లతో విరుచుకుపడ్డారు.

హైదరాబాద్‌లో మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే ఎందుకు స్పందించలేదని అనసూయను ప్రశ్నించారు. దీనికి అనసూయ మళ్లీ వరుస ట్వీట్లు చేసింది. నేను డబ్బుల కోసం ట్వీట్లు చేయను. ఓ విషయం పై అవగాహన ఉంటేనే నేను ట్వీట్ చేస్తా. నేను చేసింది ఒకవేళ తప్పు అయితే సరిదిద్దుకుంటా. కానీ నా ట్వీట్లపై మీరు రాజకీయం చేయవద్దు అని ఆమె ట్వీట్ చేశారు.

Next Story