Anasuya Comments on Heroes: హీరోలు షర్ట్ తీసి.. ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తే మీకు ఫరవాలేదా: అనసూయ

Anasuya Bharadwaj (tv5news.in)
X

Anasuya Bharadwaj (tv5news.in)

Anasuya Comments on Heroes: అసలే మాటల పుట్ట. ఒక్కసారి కదిపితే చాలు.. టేకింగ్ లేకుండానే టాకింగ్ వచ్చేస్తుంది.

Anasuya Comments on Heroes: అసలే మాటల పుట్ట. ఒక్కసారి కదిపితే చాలు.. టేకింగ్ లేకుండానే టాకింగ్ వచ్చేస్తుంది. ఎవరైనా ఏమైనా తేడాగా కామెంట్ చేస్తే.. దీపావళి ఆటంబాంబులా మండిపోతుంది. అనసూయ. అందులో తప్పేమీ లేదు. అనవసరంగా మాట పడడం దేనికి అనేది ఆమె అభిప్రాయం కావచ్చు. కానీ కోట శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ పై ఏమాత్రం వెనక్కు తగ్గకుండా రిప్లయ్ ఇచ్చిన అనసూయ.. ఆ వేడిలో... హీరోల ఎక్స్ పోజింగ్ పై సీరియస్ కామెంట్ చేసింది. ఇప్పుడు అది వైరల్ గా మారింది.



అనసూయ డ్రెస్ సెన్స్ పై కోట శ్రీనివారావు కామెంట్ చేశారు. ఆమె యాక్టింగ్ బాగా చేస్తుందని.. కానీ పెళ్లయి పిల్లలున్న తల్లిగా అలాంటి డ్రెస్ లు వేసుకోవడం నచ్చలేదని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. దీంతో ఆయన మాటలు వైరల్ గా మారాయి. వాటికి పరోక్షంగా ఘాటు రిప్లయ్ ఇచ్చిన అనసూయ.. అదే ఆవేదనలోనో, బాధలోనో, ఆవేశంలోనో, ఆలోచనతోనో కాని హీరోల ఎక్స్ పోజింగ్ పైనా కామెంట్ చేసింది.



పెళ్లి చేసుకుని, పిల్లల్ని కన్న హీరోలు.. తమ షర్ట్ తీసి కండలు చూపిస్తూ.. ఎక్స్ పోజింగ్ చేస్తూ.. హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తుంటే మాత్రం ఎందుకు ఏమీ అనరని.. ఎవరూ ఎందుకు ప్రశ్నించరని కడిగిపారేసింది. దీంతో ఈ కామెంట్స్ కాస్తా వైరల్ గా మారాయి. బుల్లితెరతోపాటు కొద్దికాలంగా వెండితెరపైనా నటిస్తోంది అనసూయ. అలాంటప్పుడు హీరోల ఎక్స్ పోజింగ్ గురించి మాట్లాడడంతో ఇప్పుడిది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.



అనసూయ కామెంట్స్ చాలా ఘాటుగానే ఉంటాయి. అందులోనూ ఇలాంటి సందర్భాల్లో చేసే కామెంట్స్ ఇంకా వైరల్ గా మారతాయి. ఇప్పుడీ కామెంట్స్ కూడా అలాగే వైరల్ గా మారాయి.

Tags

Next Story