Maa Elections 2021 Results: ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి అనసూయ గెలుపు.. ఓట్ల విషయంలో..

anasuya (tv5news.in)

anasuya (tv5news.in)

Maa Elections 2021 Results: ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి ఈసీ మెంబర్ గా పోటీ చేసిన అనసూయ విజయం సాధించారు.

Maa Elections 2021 Results: ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి ఈసీ మెంబర్ గా పోటీ చేసిన అనసూయ విజయం సాధించారు. యాంకర్ అనసూయగా బుల్లితెరపైన, వెండితెరపైన తనదైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. మా ఎన్నికల్లో తొలి నుంచి ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరి వరకు రెండు ప్యానళ్ల మధ్య ఉత్కంఠభరితమైన పోరు నెలకొంది. దీంతో ఈసీ మెంబర్లుగా ఎవరు గెలుస్తారా అని చాలా మంది టెన్షన్ తో ఎదురుచూశారు.

ఈసీ మెంబర్లలో చాలామంది ఓటర్లకు సుపరిచితులే. అందుకే వారి నేపథ్యం బాగా తెలుసు. యాంకర్ అనసూయ గురించి ఎక్కువమందికి తెలిసుండడం, ఇప్పటికే పాపులర్ అవ్వడం, ఈమధ్యనే వెండితెరపైన మంచి విజయాలు అందుకోవడంతో అనసూయ పేరు అందరికీ బాగా గుర్తుంటుంది. పైగా ఈసీ మెంబర్ గా పోటీ చేస్తున్నప్పటి నుంచి గెలుపు కోసం అనసూయ కూడా బాగానే కష్టపడ్డారు.

వ్యక్తిగత పరిచయాల వల్ల అనసూయకు ఓటేయడానికి ఎక్కువమంది మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఆమెకు భారీ మెజార్టీ వచ్చే అవకాశముంది. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి ఈసీ మెంబర్ గా పోటీ చేసిన సురేష్ కొండేటి కూడా విజయం సాధించారు. ఆయనకు చిత్రపరిశ్రమతో చాలా కాలం నుంచి అనుబంధం ఉంది. సినీ పరిశ్రమలో చాలామందితో పరిచయాలు ఉన్నాయి. దీంతో ఆయన ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేసినా.. వ్యక్తిగత పరిచయాలు కూడా ఆయనకు లాభించాయని టాలీవుడ్‌లో టాక్. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేసినవారిలో చాలామందికి ఇండస్ట్రీతో అనుబంధం ఉంది. అదే వారికి లాభించిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

Tags

Next Story