Anasuya Emotional : ఎప్పటికీ మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను.. అనసూయ ఎమోషనల్ పోస్ట్

Anasuya Emotional : బుల్లితెర యాంకర్ అనసూయ తండ్రి సుదర్శన్ రావు ఇటీవలె కన్నుమూసిన సంగతి తెలిసిందే.. ఆయనని తలుచుకుంటూ అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 'మీరిచ్చిన జీవితానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. మాకు నచ్చిన విధంగా జీవితాన్ని గడిపేలా నేర్పించారు. ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఉండమని నేర్పించారు. మాతో మీరు గడిపిన సమయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం.
అర్థరాత్రులు మీరిచ్చే సర్‌ప్రైజ్‌లను ఎప్పటికీ మర్చిపోలేను. అదంతా మాపై మీకున్న అపరిమితమైన ప్రేమ. నాన్నలా ఎంతో గొప్పగా , ఆదర్శంగా నిలిచారు. ఎప్పటికీ మిమ్మల్ని గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా నాన్న. మీరు వెళ్లిపోయినా ఎప్పటికీ మాతోనే ఉంటారని బలంగా నమ్ముతున్నాను. మీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నా' అని రాసుకొచ్చింది.
ఇక న్యూస్ రీడర్ నుంచి బుల్లితెర యాంకర్ గా మారింది అనసూయ..జబర్దస్త్ షో ఆమెకి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. బుల్లితెర పై యాంకర్ గా రాణిస్తూనే మంచిమంచి పాత్రలు వచ్చినప్పుడు వెండితెర పై నటిగా కూడా మెప్పిస్తోంది. తాజాగా ఆమె నటించిన పుష్ప చిత్రం రేపు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో అనసూయ దాక్షయని అనే పాత్రలో నటిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com