నాకు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయి : అనసూయ

నాకు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయి : అనసూయ
సినీ ఇండస్ట్రీలో కరోనా కలకలం రేపుతోంది. బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా ఇప్పటికే చాలా మంది నటులు కరోనా బారిన పడ్డారు.

సినీ ఇండస్ట్రీలో కరోనా కలకలం రేపుతోంది. బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా ఇప్పటికే చాలా మంది నటులు కరోనా బారిన పడ్డారు. కొందరు కరోనా నుంచి కోలుకోగా, మరికొందరు మాత్రం మృత్యువాతపడ్డారు. ఇక ఇదిలా ఉంటే.. జబర్దస్త్ యాంకర్ అనసూయ తనకి కరోనా లక్షణాలు ఉన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ రోజు ఉదయం కర్నూలులో ఓ ప్రోగ్రామ్ కి వెళ్దామని అనుకున్నానని కానీ.. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆ ప్రోగ్రామ్‌ను క్యాన్సిల్ చేసుకున్నట్టుగా వివరణ ఇచ్చింది. అంతేకాకుండా తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరోనా పరీక్షలు చేయించుకుంటామని తెలిపింది. ఇక ఇటీవల తనని కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేసుకోవాలని కోరింది అనసూయ!


Tags

Read MoreRead Less
Next Story