Anasuya To KTR : కేటీఆర్ సార్ ఇదెక్కడి న్యాయం.. అనసూయ ఆవేదన..
Anasuya To KTR :చిన్నారుల భద్రత విషయంలో కొన్ని పాఠశాలలు అనుసరిస్తున్న తీరుపై నటి, యాంకర్ అనసూయ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా మూతబడిన పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. కానీ భద్రతా ప్రమాణాలు ఏవిధంగా ఉన్నాయో అని, పిల్లలను బడికి పంపించాలంటే భయపడుతున్నారు తల్లిదండ్రులు. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు.. బడికి పంపించమంటున్నారు. కానీ వారి భద్రత విషయంలో ఎలాంటి భరోసా ఇవ్వట్లేదంటూ అనసూయ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు.
సర్.. కరోనా కారణంగా మొదట మనం లాక్‌డౌన్ అనుసరించాం. కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్ తొలగించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం అయింది. కానీ చిన్నారులకు వ్యాక్సిన్ లేదు.. మరి వాళ్లని స్కూల్‌కి ఎలా పంపించాలి.. స్కూల్లో ఏం జరిగినా యాజమాన్యానిది బాధ్యత కాదని అంటున్నాయి. ఆ మేరకు ఓ అంగీకరా పత్రం కూడా తీసుకురావాలని పిల్లలపై ఒత్తిడి చేస్తున్నాయి. ఇదెక్కడి న్యాయం సర్.. ఇదేమైనా పద్దతేనా అంటూ అనసూయ కేటీఆర్‌కి ట్వీట్ చేశారు. ఎప్పటిలాగే మీరు ఈ విషయాన్ని సమీక్షిస్తారని భావిస్తున్నాను అని అనసూయ ట్వీట్ చేశారు.
(2/2) to send the children to school with a signed document which says they are NOT responsible if/whatsoever happens to the children while they are at school.. tell me sir.. how fair is this.. hoping you would guide us right as always.. we are all in a fix 🙏🏻
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 29, 2021
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com