నేనిచ్చిన గిప్ట్ చూసి గంగవ్వ రియాక్షన్.. : ప్రదీప్

నేనిచ్చిన గిప్ట్ చూసి గంగవ్వ రియాక్షన్.. : ప్రదీప్
ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మై విలేజ్ షో టీమ్,

మై విలేజ్ షో.. గంగవ్వ ఎంట్రీతో బాగా పాపులర్ అయిపోయింది. గ్రామంలోని గల్లీలో ప్రారంభమైన ఓ యూట్యూబ్ ఛానెల్ ఇది. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు సెలబ్రెటీలు సైతం మై విలేజ్ షో ద్వారా తమ సినిమా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. టీమ్ సభ్యుల్లో ఒకరైన గంగవ్వ తన మాటతీరుతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. కూలి పనులు చేసుకునే గంగవ్వ ఇప్పుడొక సెలబ్రెటీ అయిపోయి ఇంటర్వ్యూలు, షోలు చేస్తోంది. ఓ స్టార్ స్టేటస్‌ని సంపాదించుకుంది. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి మరింత మందికి దగ్గరైంది. ఈ క్రమంలోనే యాంకర్ ప్రదీప్ కూడా తన సినిమా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' ప్రమోషన్ కోసం మై విలేజ్ షో కోసం గంగవ్వ వూరు వెళ్లాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మై విలేజ్ షో టీమ్, గంగవ్వపై యాంకర్ ప్రదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

గంగవ్వ వాళ్ల ఊరు వెళుతున్నానని అమ్మతో చెబితే తనకి ఇవ్వమంటూ అమ్మ ఓ చీర ఇచ్చింది. షోకి సంబంధించిన షూట్ పూర్తయ్యాక అమ్మ ఇచ్చిన చీరను ఆమెకు గిప్ట్‌గా ఇచ్చాను. దాంతో ఆమె ఏంది.. బిడ్డా ఇవన్నీ ఎందుకు అన్నది. లేదవ్వా నాతో పని చేశావు కదా.. నా గుర్తుగా తీసుకో అనగానే సంతోషంగా స్వీకరించింది అని ప్రదీప్ చెప్పుకొచ్చారు. ఆ ఊర్లో వాళ్లు మాట్లాడే భాష, పచ్చని పంట పొలాలు, గంగవ్వ పెట్టిన పెరుగన్నం అన్నీ ఎంతో అందంగా అనిపించాయి. ఊరి వాళ్ల పలకరింపు ఎంతో ఆప్యాయంగా అనిపించింది. పొలం గట్లపై వాళ్లతో కలిసి భోజనం చేయడం చాలా ఆనందంగా అనిపించింది. నా సినిమా ప్రమోషన్స్‌కి వాళ్లు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిదని అన్నాడు. ఇక ప్రదీప్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. హీరోగా ప్రదీప్, హీరోయిన్‌గా అమృతా అయ్యర్‌ల నటన ఆకట్టుకుంది.

Tags

Read MoreRead Less
Next Story