Rashmi Gautam: అక్కినేని చిత్రంలో అమ్మడికి ఛాన్స్

Rashmi Gautam:బుల్లి తెరపై యాంకర్ గా రాణిస్తున్నా అడపా, దడపా సినిమాల్లో నటిస్తూ వచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంటోంది హాట్ బ్యూటీ రష్మి గౌతమ్. గుంటూరు టాకీస్, నెక్స్ట్ నువ్వే వంటి కొన్ని తెలుగు సినిమాల్లో నటించినా అవకాశాలు అంతగా రాలేదు.
తాజా సమాచారం ప్రకారం, రష్మి గౌతమ్ కింగ్ నాగార్జున నటించబోయే ఓ చిత్రంలో అవకాశం కొట్టేసిందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, కాజల్ అగర్వాల్‌తో రష్మీ స్క్రీన్ ని పంచుకోనుంది.
అక్కినేని నాగార్జున నటిస్తున్నఈ చిత్రంలో రష్మీ గౌతమ్ కీలక పాత్ర పోషించనున్నారు. గతంలో రష్మి గౌతమ్ ప్రవీణ్ సత్తారుతో కలిసి సిద్దూ జోన్నలగడ్డ నటించిన సూపర్ హిట్ చిత్రంలో పనిచేశారు. తరువాత దీనిని తమిళంలో 'ఇవానుక్కు ఎంజేయో మచ్చం ఇరుక్కు'గా 2018 లో రీమేక్ చేశారు.
ఈ పాత్రకు రష్మీ గౌతమ్ సరైన ఎంపిక అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. కోవిడ్ -19 కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది. రష్మి గౌతమ్ చివరిసారిగా 2019 లో విడుదలైన శివరంజనిలో కనిపించింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com