Anchor Ravi : యాంకర్ రవి ఇంటికి పోలీసులు.. ఎందుకంటే...!

సోషల్ మీడియా అందుబాటులో వచ్చాక సెలబ్రిటీల పైన ట్రోల్స్ అనేవి కామన్ అయిపోయాయి. అయితే కొందరు సెలబ్రిటీలు దీనిని లైట్ తీసుకుంటే మరికొందరు మాత్రం సీరియస్ తీసుకొని రెస్పాండ్ అవుతున్నారు. హద్దుమీరి ట్రోల్స్ చేసిన వారికి శిక్ష పడేలా చేస్తున్నారు. తాజాగా యాంకర్ రవి కూడా అదే పని చేశాడు. తనపై, తన కుటుంబ సభ్యులపై నెగిటివ్ కామెంట్స్ చేసిన నెటిజన్స్ పైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు.
ఈ సారి ఏకంగా పోలీసులను తన ఇంటికి పిలిపించుకొని మరి ఆధారాలు, స్క్రీన్ షాట్స్ అందించాడు. దీనికి సంబంధించిన వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. మీరు చేయాలనుకున్నది మీరు చేయండి.. నేను చేయాల్సింది చేస్తా. కానీ ఒకరికి ఒక నెగిటివ్ కామెంట్, రిప్లై పెట్టే ముందు 30 సెకన్లు ఆలోచించండి.
ఇక సోషల్ మీడియాలో చెత్తను క్లీన్ చేద్దామని సోషల్ మీడియాలో దుర్భాషకు వ్యతిరేకంగా పోరాడుదామనే హ్యాష్ ట్యాగులతో రవి ఈ వీడియోని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన రవి.. తన ఫ్రెండ్ అయిన సింగర్ శ్రీరామ్ ని గెలిపించాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com