సినిమా

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో ఎమోషన్స్.. కూతుర్ని చూసి రవి..

Bigg Boss 5 Telugu: కానీ తమ వాళ్లు వస్తున్నారని తెలిసి ఆనందం ఆర్ణవమైంది.

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో ఎమోషన్స్.. కూతుర్ని చూసి రవి..
X

Bigg Boss 5 Telugu: చుట్టూ అందరూ ఉన్నా ఎవ్వరూ లేనట్టే ఉంటుంది.. అయిన వాళ్లకి దూరంగా అన్ని రోజులు ఉండాలంటే ఎంత కష్టం.. మనసులో ఎంత బాధ ఉన్నా ఆడుతూ, పాడుతూ, అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తూ.. విన్నర్‌గా బయటకు రావాలని హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు తమ కన్నీళ్లను బయటకు కనిపించనివ్వరు. కానీ తమ వాళ్లు వస్తున్నారని తెలిసి ఆనందం ఆర్ణవమైంది. కుటుంబ సభ్యుల్ని హౌస్‌లోకి ప్రవేశ పెట్టిన బిగ్‌బాస్ ఈరోజు యాంకర్ రవి భార్య నిత్య, కూతురు వియాని తీసుకొచ్చారు.

అప్పటి వరకు ఫ్రీజ్‌లో ఉన్న రవి ఒక్కసారిగా ఎమోషన్ అయ్యాడు భార్యని, కూతురిని చూసి. ఎప్పుడూ పక్కనే ఉంటే అంతగా తెలియదు.. దూమైనా కొద్దీ దగ్గరవ్వాలనిపిస్తుంది. భార్యని హగ్ చేసుకుని, కూతుర్ని ఆడించి, కన్నీళ్లతో ఒకరికొకరు బై చెప్పుకుని బయటకు వెళ్లారు. తాజాగా విడుదలైన ప్రోమో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. రవి కూతురు వియా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. కంటెస్టెంట్లందరూ కాసేపు వియాతో కబుర్లు చెప్పారు.

Next Story

RELATED STORIES