Anchor Ravi: వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన యాంకర్ రవి..

Anchor Ravi (tv5news.in)
Anchor Ravi: బుల్లితెరపై పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించి.. యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు రవి. తన పేరునే యాంకర్ రవిగా మార్చుకున్నాడు. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 5లో కనిపించిన రవి.. ఎలిమినేషన్ తన ఫ్యాన్స్‌ను చాలానే బాధపెట్టింది. రవిని అన్యాయంగా ఎలిమినేట్ చేశారంటూ తనను మళ్లీ వెనక్కి తీసుకురావాలంటూ ఫ్యాన్స్ కోరారు.
రవి మళ్లీ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడతాడేమో అనుకున్నారు ప్రేక్షకులు. కానీ అది నిజం కాదని తేలిపోయింది. ఇక ఇటీవల సింగర్ శ్రీరామచంద్రకు సపోర్ట్ చేస్తూ.. యాంకర్ రవి వినూత్న ప్రచారం చేపట్టాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చేసిన తర్వాత రవి.. లోపల ఉన్న తన ఫ్రెండ్స్ కోసం ఆడడం మొదలుపెట్టాడు. ఇటీవల రవి ఓ కేసు విషయంపై పోలీసులను ఆశ్రయించాడు.
బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత నెటిజన్లు కొందరు హౌస్ గురించి, హౌస్‌మేట్స్ గురించి నెగిటివ్‌గా మాట్లాడడాన్ని రవి గమనించాడు. కొందరు అయితే హౌస్‌మేట్స్ ఫ్యామిలీని కూడా కమెంట్ చేశారు. వారిపై ఆగ్రహంతో రవి ఒక వీడియోను విడుదల చేశాడు. హౌస్‌మేట్స్ నచ్చకపోతే సపోర్ట్ చేయవద్దని, అంతే కానీ నెగిటివ్‌గా మాత్రం మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చాడు. అయినా కొందరు మారలేదు.
అందుకే సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో ఎవరైనా, ఎవరిగురించైనా తప్పుడు సమాచారం ప్రచారం చేసినా.. ఎవరినైనా కించపరిచేలా మాట్లాడినా.. వారి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు రవి. తప్పు మాట మాట్లాడాలి అన్నా, టైప్ చేయాలి అన్న భయం పుట్టాలి ఇప్పటినుండి అంటూ తాను పోలీసుకు అందిస్తున్న కంప్లైంట్‌ను ఫోటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు రవి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com