Anchor Ravi: బుల్లితెర క్రేజీ కపుల్ ఈజ్ బ్యాక్.. ఇక విభేదాలు ఉండవు..!

Anchor Ravi: కొన్ని బుల్లితెర కపుల్స్.. వెండితెర కపుల్స్‌కంటే చాలా ఫేమస్. బుల్లితెరపై కొన్ని షోస్ సూపర్ హిట్ అవుతున్నాయంటే.. దానికి కపుల్స్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ఒక కారణం. అలా బుల్లితెరపై పలు షోస్‌తో అందరినీ అలరించి, చాలామంది ప్రేక్షకులకు దగ్గరయిన కపుల్ రవి, శ్రీముఖి. అలాంటి కపుల్ చాలాకాలం నుండి స్క్రీన్‌పై కలిసి కనిపించడం లేదు. ఇన్నాళ్లకు మళ్లీ వీరు కలిసి షోస్ చేయడం ఫ్యాన్స్‌ను హ్యాపీ చేస్తోంది.
యాంకర్ రవి పక్కన ఏ లేడీ యాంకర్ చేసినా.. వారితో కెమిస్ట్రీ పండించడం తన స్పెషాలిటీ. అలా లాస్యతో కలిసి చేసిన షోతో యాంకర్‌గా రవికి మంచి బ్రేక్ దొరికింది. ఆ తర్వాత లాస్య ప్లేస్‌లోకి శ్రీముఖి వచ్చింది. వీరిద్దరి వల్లే 'పటాస్' అనే షో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. షో మంచి ఫార్మ్‌లో సాగుతున్న సమయంలోనే శ్రీముఖి.. పటాస్ నుండి తప్పుకుంది.
బిగ్ బాస్ సీజన్ 3లో అవకాశం రావడంతో శ్రీముఖి తన షోస్ అన్నింటికి బ్రేక్ ఇచ్చేసింది. తనకు బుల్లితెర ప్రేక్షకులలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో శ్రీముఖి ఆ సీజన్‌కు రన్నర్‌గా నిలిచింది. ఇక తాజాగా రవి కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రవికి ఉన్న పాపులారిటీతో తనే బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ అవుతాడేమో అనుకున్నారు చాలామంది. కానీ అలా జరగలేదు. ఫైనల్ రేసుకు కూడా వెళ్లకుండానే రవి ఎలిమినేట్ అయిపోయాడు.
అలా రవి, శ్రీముఖి ఇద్దరూ బిగ్ బాస్ తెరపై మెరిసి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కానీ వీరిద్దరు కలిసి కనిపించకపోవడంతో పటాస్ షో ముందుకు వెళ్లలేక ఆగిపోయింది. తాజాగా వీరిద్దరూ కలిసి ఓ ఈవెంట్‌ను హోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన షూటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వీరిద్దరు కలిసి మరిన్న షోస్ కూడా చేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com