సినిమా

Bigg Boss Season 5 Telugu : అతడినే గెలిపించండి.. ఆటో నడుపుతూ యాంకర్ రవి ప్రచారం..!

Anchor Ravi : అక్కినేని నాగార్జున హోస్ట్‌‌‌గా చేస్తోన్న బిగ్‌‌‌బాస్ తెలుగు సీజన్ 5 ఆసక్తికరంగా సాగుతోంది. 19 మందితో మొదలైన ఈ సీజన్‌‌‌‌లో ఇప్పుడు ఐదుగురు మాత్రమే మిగిలారు.

Bigg Boss Season 5 Telugu  : అతడినే గెలిపించండి.. ఆటో నడుపుతూ యాంకర్ రవి ప్రచారం..!
X

Anchor Ravi : అక్కినేని నాగార్జున హోస్ట్‌‌‌గా చేస్తోన్న బిగ్‌‌‌బాస్ తెలుగు సీజన్ 5 ఆసక్తికరంగా సాగుతోంది. 19 మందితో మొదలైన ఈ సీజన్‌‌‌‌లో ఇప్పుడు ఐదుగురు మాత్రమే మిగిలారు. అయితే ఈ ఐదుగురులో విన్నర్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. తమకి నచ్చిన కంటెస్టెంట్ లను గెలిపించేందుకు అభిమానులతో పాటుగా ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు కూడా కష్టపడుతున్నారు.

అదెలా అంటారా.. వారికి నచ్చిన ఫైనలిస్టుల్లో ఒకరికి ఓట్లేయమంటూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా యాంకర్ రవి.. సింగర్‌ శ్రీరామ్‌ కోసం ఆటోవాలా లాగా మారిపోయాడు. బిగ్‌‌‌బాస్ టైటిల్‌ శ్రీరామ్‌కే దక్కాలంటూ ప్రచారం మొదలు పెట్టాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'బిగ్‌బాస్‌ సీజన్‌ 5 గెలిచేది ఒకే ఒక్కరు.. అది శ్రీరామచంద్ర మాత్రమే.. అతడికే ఓటేయండి' అంటూ ఆటో నడిపాడు.

ఈ ఆటో వెనకాల శ్రీరామ్‌ను గెలిపించాలంటూ పోస్టర్‌ కూడా ఉంది. దీనితో సింగర్ శ్రీరామ్ అభిమానులు ఖుషి అవుతున్నారు. 'నువ్వు లోపలుండి ఆడు, నీకోసం నేను బయటనుంచి ఆడతా' అన్న మాటను రవి నిజం చేస్తున్నాడని కామెంట్స్ పెడుతున్నారు. కాగా బిగ్‌‌బాస్ హౌజ్ నుంచి యాంకర్ రవి 12వ వారంలో ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.


Next Story

RELATED STORIES