Anchor Shyamala : ఒకప్పుడు వర్మ చిత్రాలకు పెద్ద అభిమానిని : యాంకర్ శ్యామల

Anchor Shyamala : యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తనదైన స్టైల్‌లో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. తాజా లైవ్ చాట్ నిర్వహించిన ఆమె.. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి సమాధానలు ఇచ్చారు. అందులో భాగంగానే ఓ నెటిజన్.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి అడగగా ఈ విధంగా స్పందించింది శ్యామల.
వర్మ గురించి చెప్పమనగానే శ్యామల.. 'నో కామెంట్స్.. కానీ ఆయన గొప్ప దర్శకుడు. ఒకప్పుడు వర్మ చిత్రాలకు పెద్ద అభిమానిని' అని రిప్లయ్ ఇచ్చింది. అయితే శ్యామల సమాధానం పైన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. అంటే వర్మ ఇప్పుడు మంచి సినిమాలు తీయడం లేదని మీ అభిప్రాయామా అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలావుండగా 'బడవ రాస్కెల్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యాంకర్ శ్యామల పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు దర్శకుడు ఆర్జీవీ.. "అసలు ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్ళలోంచి ఇన్నాళ్లు ఎలా తప్పించుకున్నారు" అంటూ సరదాగా అన్నారు వర్మ.. దీనికి షాక్ అయిన శ్యామల ఆ తర్వాత సిగ్గుపడి నవ్వేసింది. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com