Anchor Sreemukhi : యాంకర్ శ్రీముఖి ఇంట విషాదం..!
Anchor Sreemukhi : సినీ నటి, ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఇంట విషాదం నెలకొంది. సోమవారం ఉదయం శ్రీముఖి అమ్మమ్మ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని శ్రీముఖి స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు శ్రీముఖి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 'అమ్మమ్మ అంటే నాకు ఇష్టం. జీవితంలో చాలా విషయాలను తన నాకు చెప్పింది. ఎప్పుడూ హుషారుగా ఉండేది. అందరికి సంతోషాన్ని పంచేది. ఎల్లప్పుడూ సంతోషాన్ని అందరికీ పంచేది. ఆమె చాలా ధైర్య వంతురాలు. జీవితంలో నువ్వు ఇచ్చిన ప్రతి దానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎప్పుటికీ నిన్ను గుర్తు పెట్టుకుంటాను అమ్మమ్మ 'అంటూ పోస్ట్ చేసింది శ్రీముఖి. కాగా బుల్లితర యాంకర్ గా ప్రేక్షకులకి పరిచమైన శ్రీముఖి, బిగ్ బాస్ షోతో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. తాజాగా 'క్రేజీ అంకుల్స్'మూవీతో ప్రేక్షకులను పలకరించింది
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com