Srimukhi: చిక్కిన శ్రీముఖికి సినిమా అవకాశాలు దక్కునా..

Srimukhi: చిక్కిన శ్రీముఖికి సినిమా అవకాశాలు దక్కునా..
Srimukhi: చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. అందుకే ఆ మధ్య చాలా చబ్బీగా కనిపించిన ఓ యాంకరమ్మ.. సడెన్ గా సన్నబడింది.

Srimukhi: చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. అందుకే ఆ మధ్య చాలా చబ్బీగా కనిపించిన ఓ యాంకరమ్మ.. సడెన్ గా సన్నబడింది. ఇప్పుడు చూడ్డానికి మరింత అందంగా కనిపిస్తోంది. దీంతో ఒకప్పుడు మందంగా ఉన్నావు అన్నవాళ్లే ఇంతందం దారి మళ్లిందా అని పాడుతున్నారు.



అయితే అమ్మడు తను సన్నబడ్డాను అని చెప్పడానికి ఈ మధ్య సోషల్ మీడియాలో దాదాపు రోజూ హాట్ హాట్ ఫోటోస్ ను పోస్ట్ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. దీంతో కొందరైతే పాపం ఈ సొగసులారబోత తట్టుకోలేకపోతున్నాం.. ఈ అందగత్తెను ఎవరైనా పట్టించుకోండయ్యా అంటూ సినిమా ఇండస్ట్రీ వారిని అడిగేస్తున్నారు. మరి ఆ ఒంపుల ఖిల్లా ఎవరో అనుకుంటున్నారు కదా..?


శ్రీ ముఖి.. బుల్లితెరపై తనదైన శైలిలో ఆకట్టుకుంటూ యాంకర్ గా తిరుగులేని పొజిషన్ లో ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొన్ని సినిమాల్లో కూడా నటించింది. బట్ అవేవీ అమ్మడికి హీరోయిన్ గా ప్రమోషన్ ఇవ్వలేకపోయాయి. అప్పుడప్పుడూ అక్కా, చెల్లి పాత్రల్లోనూ కనిపించింది.



రీసెంట్ గా క్రేజీ అంకుల్స్ ను కవ్వించే ప్రయత్నం చేసినా అది తనక పెద్దగా కలిసి రాలేదు. ఈ లోగా బుల్లితెరపైనే యమా బిజీ అయిపోయింది. బట్ మరీ లావైంది అనే కమెంట్స్ కూడా వస్తుండేవి. ఒక దశలో పట్టించుకోలేదు కానీ.. తర్వాత ఆ కమెంట్స్ పెరగడంతో సీరియస్ గా తీసుకుందేమో. అందుకే డ్రమ్ లా ఉన్న ఫిగర్ ను స్లిమ్ గా మార్చుకుంది. ఇప్పుడైనా అవకాశాలు రాకపోతాయా అని ఎదురు చూస్తోంది శ్రీ.

Tags

Read MoreRead Less
Next Story