యాంకర్ సుమ ఎందుకో స్లిప్ అయ్యింది.. క్షమాపణలు కోరింది..

యాంకర్ సుమ ఎందుకో స్లిప్ అయ్యింది.. క్షమాపణలు కోరింది..
మాటల ప్రవాహం.. ఇన్ని ఏళ్ళలో ఎక్కడా కూడా తనపై చిన్న రిమార్కు కూడా రానివ్వకుండా చూసుకుంటోంది.

మాటల ప్రవాహం.. ఇన్ని ఏళ్ళలో ఎక్కడా కూడా తనపై చిన్న రిమార్కు కూడా రానివ్వకుండా చూసుకుంటోంది. పొరపాటున కూడా వివాదాల్లో చిక్కుకోదు. స్పాంటేనియస్ గా మాట్లాడుతూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. అందుకే ఆమె అందుబాటులో లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్లను కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు నటీనటులు. స్టేజ్ మీద సుమ ఉంటే ఆ జోషే వేరప్పా.. ఎంతటి గ్రేట్ డైరెక్టర్లయినా, నటీనటులైనా హాయిగా నవ్వుకోవలసిందే.

సుమ జోకులు ఎవరినీ ఇబ్బంది పెట్టవు కాబట్టి. కానీ త్వరలో విడుదల కాబోతున్న “ఆదికేశవ” సినిమాలోని “లీలమ్మో” పాట ఆవిష్కరణ కార్యక్రమంలో సుమ మీడియా మిత్రుల మీద సెటైర్ వేసింది. దాంతో వాళ్లు కాస్త నొచ్చుకున్నారు. వెంటనే ఆమెకు తన తప్పుని గుర్తు చేశారు. ఆమె కూడా స్టేజ్ మీదే వారికి సారీ చెప్పింది. అయినా బుర్రలో తొలుస్తుందేమో అనవసరంగా అన్నానని అందుకే ఈ రోజు మరోసారి మీడియా మిత్రులకు సారీ చెబుతూ వీడియో పోస్ట్ చేసింది.

ఇంతకే సుమక్క ఏమందంటే.. మీడియా మిత్రులు స్నాక్స్ భోజనంలా తింటారని మాట్లాడింది. దాంతో ఓ విలేకరి మీరు అలా అనకుండా ఉండాల్సింది అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘మీరు స్నాక్స్‌ను స్నాక్స్‌లానే తిన్నారు ఓకేనా?’ అని సుమ అనగా.. ‘ఇదే వద్దనేది. మీ యాంకరింగ్‌ అందరికీ ఇష్టమైనా మీడియా విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు తగదు’ అని సదరు విలేకరి ఘాటుగా సమాధానమిచ్చారు.

దాంతో సుమ వేదికపైనే వారిని క్షమాపణలు కోరింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేసిన వీడియోలో, సుమ తన విచారం వ్యక్తం చేసింది. మీడియా సోదరులను క్షమాపణ కోరింది.

“ఈ కార్యక్రమంలో నా వాఖ్యల వల్ల అసౌకర్యానికి గురైనందుకు నా మీడియా మిత్రులందరికీ నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. నా మాటల ప్రభావాన్ని నేను గ్రహించాను, దానికి చాలా విచారిస్తున్నాను. మీ పనిలో మీరందరూ పడే సవాళ్లు, కష్టాన్ని నేను అర్థం చేసుకున్నాను. మీ మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను' అని సుమ వీడియోలో పేర్కొంది.

వీడియో విడుదలతో మీడియా సోదరుల నుండి సానుకూల స్పందన వచ్చింది, చాలా మంది సుమ తన వ్యాఖ్యల ప్రభావాన్ని గుర్తించి బహిరంగంగా క్షమాపణలు చెప్పడానికి సుముఖత వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story