Suma : రాజీవ్‌కు, నాకు గొడవలు వచ్చిన మాట వాస్తవమే : సుమ

Suma : యాంకర్ సుమ.. తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అక్కరలేని పేరు... ఎంతమంది యాంకర్ లు వస్తున్నప్పటికీ సుమకి ఉన్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.. ప్రస్తుతం సుమ మెయిన్ లీడ్ లో జయమ్మ పంచాయితీ ఓ సినిమా తెరకెక్కుతోంది.. మే 6న ఈ మూవీ రిలీజ్ అవుతోంది.
ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా అలీతో సరదాగా ప్రోగ్రాంలో పాల్గొన్న సుమ.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. తన అసలు పేరు పల్లెశెన పాచిమిట్టిన సుమ అని వెల్లడించింది. అటు రాజీవ్, సుమ విడిపోయారంటూ గతంలో వచ్చిన వార్తలపైన స్పందించింది.
గతంలో రాజీవ్ కు, తనకి మధ్య గొడవలు వచ్చిన మాట వాస్తవమేనని, ఈ 23 ఏళ్ల కాలంలో ఎన్నోసార్లు గొడపడ్డామని తెలిపింది. కానీ ఒక్కటి నిజం,, కపుల్స్ గా విడిపోవడం సులువే కానీ, ఫాదర్, మదర్ గా విడిపోవడం చాలా కష్టమని అంటూ ఎమోషనల్ అయింది. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com