Roshan Kanakala: హీరోగా యాంకర్ సుమ తనయుడి జోరు.. అప్పుడే రెండో సినిమా సైన్..

Roshan Kanakala: బుల్లితెర యాంకర్ అయినా కూడా.. స్టార్ నటీనటుల స్థాయిలో పాపులారిటీని సంపాదించుకుంది సుమ. యాంకర్ సుమ అంటే ఒక బ్రాండ్‌లాగా మారిపోయేలా చేసుకుంది. ఇప్పటికీ స్టార్ హీరో సినిమాకు సంబంధించిన ఈవెంట్‌లో సుమ సందడి చేయాల్సిందే. అలాంటి గుర్తింపు తెచ్చుకున్న సుమ.. ప్రస్తుతం తన వారసుడిని ఇండస్ట్రీలోకి దింపే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా హీరోగా పరిచయం అవ్వకముందే తనన రెండో సినిమాను సైన్ చేశాడు రోషన్.
సుమ.. నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. తన పర్సనల్ లైఫ్‌ను, ప్రోఫెషనల్ లైఫ్‌ను వేరుగా చూసే సుమ.. ఎక్కువగా తన పిల్లలను లైమ్‌లైట్‌లోకి తీసుకొని రాలేదు. కానీ తన తనయుడు రోషన్ కనకాల మాత్రం ఇప్పటికే ఓ సినిమాలో సపోర్టింగ్ రోల్‌లో నటించి వెండితెరకు పరిచయమయ్యాడు.
హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా పరిచయమయిన నిర్మల కాన్వెంట్ సినిమాలో రోషన్ కనకాల ఓ చిన్న పాత్రలో కనిపించాడు. ఇప్పుడు ఏకంగా హీరోగా పరిచయం కావడానికే సిద్ధం కానున్నాడు. ఇప్పటికే విజయ్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్న రోషన్.. ఇంతలోనే ఇద్దరు యంగ్ డైరెక్టర్లను తన రెండో సినిమా కోసం లైన్‌లో పెట్టాడని టాక్. దీనికి యంగ్ డైరెక్టర్ విరించి వర్మ దర్శకత్వం వహించగా.. మరో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథను అందించనున్నట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com