Udaya Bhanu: నా ప్రతి అడుగులో నాకు తోడుగా మీరు.. : ఉదయభాను ఎమోషన్

Udaya Bhanu: సినిమా తారలకు ఏమాత్రం తీసిపోని అందం.. అభినయం. బుల్లితెర యాంకర్ గా అడుగు పెట్టినా అడవా దడపా సినిమాల్లో కూడా నటించింది. గల గలా మాట్లాడుతూ, షోలో నవ్వులు పూయించే ఉదయభాను పెళ్లి, పిల్లలతో కొన్నాళ్లపాటు తన కెరీర్ కి బ్రేక్ తీసుకుంది..
అప్పుడప్పుడూ పిల్లలకు సంబంధించిన పోస్టులు పెడుతూ సోషల్ మీడియాతో టచ్ లోనే ఉన్న ఉదయభాను సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతోంది. అందులో భాగంగానే ఇన్‌స్టాగ్రామ్‌లో కొద్ది రోజులుగా వరుస వీడియోలు పోస్ట్ చేస్తోంది.
తాజాగా యూట్యూబ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించింది. తన పేరుతోనే కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన ఉదయ భాను మీ ప్రేమే నా బలం పేరుతో వీడియో పోస్ట్ చేసింది.
మీ అభిమానం నేను సాధించిన వరం, మీ ప్రేమ అభివర్ణించలేని అద్భుతం. నా ప్రతి అడుగులో నాకు తోడుగా నిలబడింది, నాకు ధైర్యాన్ని ఇచ్చింది మీరే.. అంటూ అభిమానులతో తనకు గల అనుబంధాన్ని పంచుకుంది. మీ అభిమానమే నన్ను నిలబెట్టింది. నన్ను ఎప్పుడూ పడిపోకుండా పట్టుకున్నారు గుండెల్లో పెట్టుకున్నారు.
ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను.. మీకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేయడం తప్ప.. అందుకే వస్తున్నా మీ ఉదయ భాను అంటూ వీడియోను ముగించింది. ఫ్యాన్స్ కూడా ఆమె ఎంట్రీని స్వాగతీస్తున్నారు.. పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com