Tripti Dimri : వివాదంలో యానిమల్ హీరోయిన్ తృప్తి దిమ్రి
యానిమల్ సినిమాతో స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్ తృప్తి దిమ్రి వివాదంలో చిక్కుకున్నారు. జైపూర్‌కు చెందిన మహిళా వ్యాపారవేత్తలు FICCI FLO ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు వస్తానని తృప్తి రూ.5.5 లక్షలు తీసుకున్నారని సమాచారం. నిన్న ఈవెంట్‌కు ఆమె రాకపోవడంతో మోసం చేశారంటూ నిర్వాహకులు ఆమె ఫొటోపై పెయింట్ వేసి నిరసన తెలిపారు. ఆమె సినిమాలను బ్యాన్ చేస్తామని, లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో తృప్తి దిమ్రిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని, కార్యక్రమానికి రాను అని ఎటువంటి సమాచారం ఇవ్వలేదన్నారు. జైపూర్ లో తృప్తి నటించే సినిమాలను బ్యాన్ చేస్తామని, తామందరినీ మోసం చేసిందంటూ ఆ వ్యాపారవేత్త మండిపడ్డారు. ప్రస్తుతం ఆమె చెప్పిన విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దీనిపై తృప్తి దిమ్రి ఎలా స్పందిస్తుందో చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com