Animal Box Office Collection : రూ.100 కోట్ల మార్కును దాటిన రణబీర్ మూవీ

Animal Box Office Collection : రూ.100 కోట్ల మార్కును దాటిన రణబీర్ మూవీ
X
బాక్సాఫీస్ వసూళ్లతో దూసుకుపోతున్న 'యానిమల్'.. రూ.100కోట్ల క్లబ్ లోకి ప్రవేశం

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన 'యానిమల్' మూవీ తాజాగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. డిసెంబరు 1న విడుదలైన ఈ చిత్రం రెండవ రోజు (అన్ని భాషలలో) రూ.66 కోట్లు వసూలు చేసిందని సాక్నిల్క్ నివేదిక తెలిపింది. 2వ రోజు కలెక్షన్లు తొలిరోజు రూ.63.8 కోట్ల బాక్సాఫీస్ సంఖ్యను కూడా అధిగమించాయి. మొత్తంగా, రణబీర్ కపూర్, రష్మిక మందన్నల చిత్రం రూ.129.8 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ రణబీర్, రష్మికతో పాటు, అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రీ, శక్తి కపూర్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. డే 1 దేశీయ కలెక్షన్ల విచ్ఛిన్నం గురించి మాట్లాడుతూ, బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ Xలో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ చిత్రం హిందీ వెర్షన్‌కు రూ.54.75 కోట్లు, సౌత్-ఇండియన్ భాషలకు రూ.9.05 కోట్లు వసూలు చేసిందని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. రణబీర్ కపూర్ అతిపెద్ద ఓపెనర్ యానిమల్ అని, సినిమాను సెన్సేషనల్ అని కూడా పేర్కొన్నారు.

'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' వంటి సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'యానిమల్'. ఈ సినిమా డిసెంబర్ 1న భారీగా విడుదలైంది. ప్రచార చిత్రాలతో ఓ రేంజ్‌లో అంచనాలను పెంచిన ఈ సినిమా కాస్తా మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఫస్టాఫ్ బాగుందని.. సెకండాఫ్ కాస్తా స్లోగా ఉందని అంటున్నారు చూసిన నెటిజన్స్. ఇక మరికొందరు మాత్రం ఫాదర్ సెంటిమెంట్, యాక్షన్ సీన్స్, పాటలు ఇలా బాగున్నాయని.. రణబీర్ తన నటనతో అదరగొట్టారని అంటున్నారు. బ్లాక్ బస్టర్ సినిమా అని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్నెల్ సీన్ మాత్రం ఓ రేంజ్‌లో ఉందని అంటున్నారు. ఏం తీశావయ్య సందీప్ అంటూ ఓ రేంజ్‌లో ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు ఆ విజులవ్స్, ఆ టేకింగ్, ఆ మ్యూజిక్.. సూపర్‌గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. సందీప్ రెడ్డికి మరో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం గ్యారెంటీ అని చెబుతున్నారు.

ఇక అది అలా ఉంటే ముంబైలో ఈ సినిమాకు ఉన్న హై డిమాండ్ కారణంగా అదనపు షోలు వేస్తున్నారట. ఈ విషయాన్ని పీవీఆర్ స్వయంగా ఓ ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా మిడ్ నైట్ షోలను పెంచిందిట. ఎర్లీ మార్నింగ్ షోస్.. 1, 2 గంటలకు ఈ షోస్ యాడ్ చేస్తున్నారట. అంతేకాదు.. దేశంలో పలు చోట్ల యానిమల్‌కు ఉన్న డిమాండ్ అదనపు షోలను వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఇక ఈ చిత్రం ఇండియాలో అన్ని భాషల్లో కలిపి 63 కోట్లకి పైగా గ్రాస్‌ను అందుకోగా ఒక్క నార్త్ లో 54 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.


Tags

Next Story