Nani : నానికి కూడా అనిరుధ్ ఫిక్స్

ఈ మధ్య అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటే యావరేజ్ సినిమాలు కూడా హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. కంటెంట్ వీక్ గా ఉన్నా.. ఆర్ఆర్ అదిరిపోతే ఆ విషయం మర్చిపోతున్నారు ఆడియన్స్. అందుకే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో తోపులు అనిపించుకున్న మ్యూజీషియన్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ విషయంలో సౌత్ మొత్తం వెంటపడుతున్న సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. అతని నేపథ్య సంగీతానికి ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. స్టార్ హీరోల ఫ్యాన్స్ అయితే అనిరుధ్ నే తీసుకోవాలనే డిమాండ్స్ కూడా చేస్తున్నారంటే మనోడి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే అతనికి ఇంత రేంజ్ రాక ముందే నేచురల్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్ సినిమాకు సంగీతం అందించాడు. బట్ ఆ మూవీ ఆశించినంత విజయం సాధించలేదు. బట్ ఇప్పుడు మరోసారి ఈ కాంబో ఫిక్స్ అయిపోయింది.
నాని ఊరమాస్ అవతార్ లో అదరగొట్టిన దసరా మూవీ అతని కెరీర్ లోనే స్పెషల్ గా నిలుస్తుందని చెబుతాడు. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ ఓదెలతోనే మరో ప్రాజెక్ట్ మొదలుపెట్టాడు నాని. దసరా చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ హైలెట్ గానే నిలిచింది. అయినా అతన్ని కాదని ఈ సారి అనిరుధ్ రవిచందర్ ను తీసుకున్నారు. నిజానికి ముందుగా దేవీ శ్రీ ప్రసాద్ ను అనుకున్నారట. కానీ ఎక్కువమంది అనిరుధ్ వైపే మొగ్గుచూపారని తెలుస్తోంది. అనిరుధ్ చాలా చాలా బిజీగా ఉన్నాడు. ఈ బిజీ వల్ల అతను అనుకున్న టైమ్ కు మ్యూజిక్ ఇవ్వలేకపోతున్నాడు. దేవరలో బ్యాక్ గ్రౌండ్ మరీ ఊహించినంత గొప్పగా లేదు.. పాటలు యావరేజ్ అనే టాక్ రావడానికి కారణం అతని బిజీ వల్లే అనేది అందరికీ తెలిసిందే. మరి ఎన్టీఆర్ లాంటి టాప్ హీరో సినిమాకే అంత లేట్ చేస్తే నానికి మాత్రం చెప్పిన టైమ్ కు ఇస్తాడా.. అందుకే వీళ్లు తొందరపడి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తే అది మ్యూజిక్ క్వాలిటీపైనా ప్రభావం చూపిస్తుంది. ఏదేమైనా ఇప్పుడు అనిరుధ్ టైమ్ పీక్స్ లో ఉందనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com