Thaman S : నందమూరి థమన్ కు హ్యాండ్ ఇస్తున్నారా

Thaman S :  నందమూరి థమన్ కు హ్యాండ్ ఇస్తున్నారా
X

ఏ ఇండస్ట్రీలో అయినా కాంబినేషన్స్ కు ఉండే క్రేజ్ వేరే ఉంటుంది. ఒక్కసారి హిట్ అయితేనే సూపర్ అంటారు. ఇంక హ్యాట్రిక్ కొడితే ఆగుతారా.. అదే కాంబో కంటిన్యూ అవుతుందంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ అంటే నందమూరి బాలకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ దే. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ పూర్తి చేసిన ఈకాంబోలో లేటెస్ట్ గా వచ్చిన డాకూ మహారాజ్ తో డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టారు. ఈ నాలుగు సినిమాలకూ థమన్ మ్యూజిక్ బ్యాక్ బోన్ గా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. ఓ రేంజ్ ఆర్ఆర్ తో అదరగొట్టాడు. బాలయ్య ఫ్యాన్స్ కు బోయపాటి శ్రీను తర్వాత ఆ రేంజ్ లో పూనకాలు తెప్పించింది థమనే అనేది కాదనలేని వాస్తవం.

ఇక లేటెస్ట్ గా థమన్ ను మావాడు అంటూ నందమూరి థమన్ అనేశాడు బాలయ్య. దాన్ని కంటిన్యూ చేస్తూ ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి సైతం థమన్ ను ఉద్దేశిస్తూ అదే మాటలు చెప్పింది. దీంతో కొన్నాళ్ల పాటు బాలయ్య మూవీస్ అన్నిటికీ థమనే సంగీతం చేస్తాడు అనుకున్నారు. అనుకున్నట్టుగానే అఖండ2కు అతనే మ్యూజిక్ డైరెక్టర్. బట్ ఆ తర్వాత మూవీకి మాత్రం థమన్ కు హ్యాండ్ ఇచ్చారు.

అఖండ 2 తర్వాత బాలయ్య వీర సింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేనికి మరో ఛాన్స్ ఇచ్చాడు. జైలర్ తరహాలో ఇతర భాషల హీరోలను కూడా ఇందులో తీసుకుంటారని టాక్. అలాగే జైలర్ మ్యూజిక్ డైరెక్టర్ నే ఈ ప్రాజెక్ట్ కు తీసుకోబోతున్నారని టాక్. అందుకు బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటున్నారు. సో..అయితే కొన్నిసార్లు దర్శకుడి ఛాయిస్ లే ఫైనల్ అవుతాయి. పైగా బాలయ్య అంటే దర్శకుల పనిలో అస్సలు వేలుపెట్టని ఏకైక హీరో అంటారు. అంచేత దర్శకులు ఎవరిని ఓకే చేసుకుంటే వారికే ఈయనా ఓకే అంటాడు. కాకపోతే అప్పుడే నందమూరి థమన్ అనకుండా ఉండాల్సిందేమో అనే ఫీలింగ్ థమన్ ఫ్యాన్స్ లో ఉందనేది కొందరి వెర్షన్.

Tags

Next Story