Anirudh : జెర్సీ దర్శకుడి మ్యాజిక్ కు అనిరుధ్ మ్యూజిక్

Anirudh :  జెర్సీ దర్శకుడి మ్యాజిక్ కు అనిరుధ్ మ్యూజిక్
X

ఫస్ట్ మూవీ మళ్లీ రావాతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకట్టుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఆ తర్వాత నానితో చేసిన జెర్సీ అతన్ని నెక్ట్స్ లీగ్ లోకి తీసుకువెళ్లింది. ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తే అక్కడ పెద్దగా ఆకట్టుకోలేదు.. కానీ అప్లాజ్ వచ్చింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ చాలా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే చాలామందికి తెలియని విశేషం ఏంటంటే.. గౌతమ్.. ఈ మూవీతో పాటు మరో సినిమా కూడా చేశాడు. ఆ సినిమా పేరే ‘మ్యాజిక్’.

విజయ్, గౌతమ్ కాంబోలో సినిమా ఎప్పుడో స్టార్ట్ అయింది. అయితే మధ్యలో దిల్ రాజు ఎంటర్ అయ్యాడు. గౌతమ్ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టించి మరీ అతనితో ద ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేశాడు. ఈ గ్యాప్ లోనే గౌతమ్ .. మరో చిన్న సినిమాగా మ్యాజిక్ మూవీ రూపొందించాడు. కంప్లీట్ మ్యూజికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి స్టార్ మ్యూజీషియన్ అనిరుధ్ సంగీతం సమకూర్చడం విశేషం. ఇంత పెద్ద మేటర్ ను ఇలా లో ప్రొఫైల్ లో ఉంచడం వెనక రీజన్ ఏంటో కానీ.. ఇవాళ (బుధవారం) అనిరుధ్ బర్త్ డే స్పెషల్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. టాలీవుడ్ టైర్ 2 హీరోలు పోటీ పడుతోన్న డిసెంబర్ 21న తమ మ్యాజిక్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

నాన్న సినిమాలో బాల నటిగా.. పొన్నియన్ సెల్వన్ లో చిన్నప్పటి ఐశ్వర్య రాయ్ గా నటించిన బ్యూటీ సారా అర్జున్ ఈ మూవీలో మెయిన్ లీడ్ గా కనిపించబోతోంది. మిగతా కాస్ట్ తో పాటు ఇతర వివరాలు కూడా త్వరలోనే తెలియజేస్తారట. మొత్తంగా గౌతమ్ ఇంత సైలెంట్ గా మరో మూవీని ఫినిష్ చేయడం విశేషం అనే చెప్పాలి.

Tags

Next Story