Annapurna: ఆ స్టార్ హీరోకి హీరోయిన్‌గా, తల్లిగా నటించిన అన్నపూర్ణ

Annapurna: ఆ స్టార్ హీరోకి హీరోయిన్‌గా, తల్లిగా నటించిన అన్నపూర్ణ
Annapurna: ఈ చిత్రంలో ఆమె పేరు కూడా అన్నపూర్ణే కావడం మరో విశేషం.

Annapurna: సినిమాల్లో అమ్మ అంటే అన్నపూర్ణే గుర్తొస్తుంది. ఆ పాత్రలో ఆమె నటించదు.. జీవిస్తుంది. దాదాపు 700లకు పైగా చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు అన్నపూర్ణ. అయితే ఆమె మొదటగా హీరోయిన్‌గా నటించిన విషయం చాలా తక్కువమందికి తెలుసు.

1975లో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన స్వర్గం నరకం సినిమాలో మోహన్ బాబు సరసన నటించింది. ఇదే ఆమెకు తొలిచిత్రం. మోహన్ బాబుకు కూడా ఇదే తొలిచిత్రం కావడం విశేషం. ఈ చిత్రంలో ఆమె పేరు కూడా అన్నపూర్ణే కావడం మరో విశేషం.

మొదటి చిత్రంతోనే ఉమా మహేశ్వరి అన్నపూర్ణగా, భక్తవత్సలం నాయుడు మోహన్ బాబుగా మార్చేశారు దాసరి. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడే మోహన్ బాబు చాలా కాలం ఇండస్ట్రీలో ఉంటారని అన్నపూర్ణ భావించారట. ఈ విషయాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇక మోహన్ బాబుకు హీరోయిన్‌గానే కాకుండా తల్లిగా కూడా నటించి మెప్పించారు అన్నపూర్ణ. అసెంబ్లీ రౌడి తదితర చిత్రాల్లో మోహన్ బాబుకి తల్లిగా నటించారు అన్నపూర్ణ. ఈ సినిమా ద్వారా మోహన్ బాబు, అన్నపూర్ణలతో పాటుగా ఈశ్వరీరావు, జయలక్ష్మీలు సినీ రంగ ప్రవేశం చేశారు.

ఈ సినిమాకిగాను ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది. ఈ చిత్రం తరువాత మోహన్ బాబు, అన్నపూర్ణల దశ మారిపోయింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story