Dushara Vijayan : రాయన్ లో ధనుష్ చెల్లిలో మరో యాంగిల్

ధనుష్ 50వ సినిమాగా వచ్చిన రాయన్ చూశారా. ఈచిత్రానికి దర్శకుడు కూడా అతనే. రాయన్ చూసిన ఎవరైనా .. ఈ మూవీలో ధనుష్ తర్వాత అంత ఎక్కవ ఇంపాక్ట్ వేసింది ఎవరు అంటే వెంటనే దుషారా విజయన్ అనే చెబుతారు. ధనుష్ సిస్టర్ పాత్రలో నటించిన ఈ భామ సెకండ్ హాఫ్ లో చెలరేగిపోతుంది. తనపై అఘాయిత్యం జరిగినా అన్నకు జరిగిన ద్రోహం కోసమే పగ తీర్చుకునే అమ్మాయిగా అద్భుతంగా నటించి శెభాష్ అనిపించుకుంది. అన్నట్టు ఈ మూవీలో తనకు ఒక వయెలెంట్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉండటం విశేషం. 2019లో నటిగా పరిచయం అయిన దుషారా ముందు నుంచీ టాలెంటెడ్ అనే అనిపించుకుంది. తనకు వచ్చిన పాత్రలన్నీ కూడా అలాగే ఉన్నాయి. పా. రంజిత్ సార్పట్టై పరంపరలో ఆర్య వైఫ్ మరియమ్మగానూ భలే నటించింది. పా. రంజితే తెరకెక్కించిన ‘నచ్చత్తిరం నాగర్ గిరదు’ అనే మూవీలో అనేక పాత్రలున్నా.. అందరికంటే తనే ఎక్కువ ఆకట్టుకుంటుంది. అలాంటి తను సడెన్ గా సోషల్ మీడియాన హీటెక్కించే ఫోజులతో బికినీ ఫోటోస్ పెడితే ఆశ్చర్యం కాక మరేంటీ..?
అఫ్ కోర్స్ సినిమాల్లో చేసిన పాత్రల్లాగే బయటా ఉండాలనేం లేదు. అయితే ప్రస్తుతం రాయన్ మూవీలో పాత్రకు అద్భుతమైన స్పందన వస్తోన్న నేపథ్యంలో ఈ ఫోటోస్ కనిపించడం కొంత ఆశ్చర్యమే. అయితే ఈ ఫోటోస్ తను అకౌంట్ నుంచి పోస్ట్ కాలేదు. వేర్వేరు అకౌంట్స్ నుంచి సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే నటిగా తను ఏ పాత్రైనా చేయడానికి సిద్ధమే అన్నట్టుగా ఉన్నాయి ఈ ఫోటోస్. అంతే కదా.. గ్లామర్ ఇండస్ట్రీలో కొందరు మడికట్టుకుని ఉంటారు. మరికొందరు పాత్రలను పాత్రలుగానే చూస్తారు. అందుకు తగ్గట్టుగానే వస్త్రధారణకు కూడా ఇబ్బంది లేనంత వరకూ యాక్సెప్ట్ చేస్తారు. ఏదేమైనా ఈ ఫోటోస్ చూసిన తర్వాత తనను అనవసరంగా డీ గ్లామర్ రోల్స్ కే పరిమితం చేస్తున్నారా అనిపిస్తోంది కదా..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com