5 Feb 2022 11:45 AM GMT

Home
 / 
సినిమా / Raj Kundra, Shilpa...

Raj Kundra, Shilpa Shetty: విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట.. !!

Raj Kundra,Shilpa Shetty: కినారాలోని బీచ్ వ్యూలోని అపార్ట్ మెంట్‌తో పాటు రాజ్ కుంద్రా పేరు మీద ఉన్న ఫామ్ హౌస్ కూడా ఆమె పేరు మీదనే మార్చినట్లు సమాచారం.

Raj Kundra, Shilpa Shetty: విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట.. !!
X

Raj Kundra, Shilpa Shetty:భార్యా భర్తల మధ్య వివాదాలే విడాకులకు దారి తీస్తాయి.. కానీ ఇక్కడ వారిద్దరు బాగానే ఉన్నారు.. ఆయన చేసే బిజినెస్‌లు ఏవో ఆమెకు తెలియదని చెప్పింది.. మరి అది ఎంత వరకు నిజమో ఆ దేవుడికే తెలియాలి.. కానీ ఆమెని కూడా వివాదంలోకి లాగారు. అయినా నిబ్బరంగానే ఉంది. అశ్లీల చిత్రాల కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలయ్యాడు రాజ్ కుంద్రా. అతడికి విడాకులు ఇవ్వాలని శిల్పాశెట్టి నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలోనే వీరిద్దరూ విడిపోతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. తాజాగా ఆ వార్త మళ్లీ బాలీవుడ్‌లో హల్ చల్ చేస్తోంది.

శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా మధ్య ఆస్తుల పంపకాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రాజ్ కుంద్రా పేరిట ఉన్న కోట్లాది రూపాయల ఆస్తులు శిల్పాశెట్టికి చేరడం గమనార్హం. దాదాపు రూ.39 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ రాజ్‌కుంద్రా పేరు మీద ఉంది. దాన్ని శిల్పాశెట్టి పేరు మీదకు మార్చారు. కినారాలోని బీచ్ వ్యూలోని అపార్ట్ మెంట్‌తో పాటు రాజ్ కుంద్రా పేరు మీద ఉన్న ఫామ్ హౌస్ కూడా ఆమె పేరు మీదనే మార్చినట్లు సమాచారం.

ఆస్తుల బదిలీ ప్రక్రియ కొనసాగుతున్నందున భవిష్యత్తులో దంపతులు భార్యాభర్తలుగా కొనసాగే అవకాశం లేదని తెలుస్తోంది. త్వరలోనే శిల్పాశెట్టి రాజ్ కుంద్రా విడాకుల విషయంలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే వీరిద్దరి అభిమానులు కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. రాజ్ కుంద్రా వివాదంలో చిక్కుకున్న తర్వాత గతంతో పోలిస్తే ఊహించని విధంగా శిల్పాశెట్టికి సినిమా ఆఫర్లు తగ్గిపోయాయి.

వీరిద్దరూ విడిపోవడం ఖాయమని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. శిల్పాశెట్టి తెలుగులో చాలా సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత శిల్పాశెట్టి తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. తెలుగులో బాలకృష్ణ, వెంకటేష్ వంటి ప్రముఖ హీరోలతో శిల్పాశెట్టి నటించింది.

Next Story