Yuganiki Okkadu : మరో క్లాసిక్ సినిమా రీ రిలీజ్ అవుతోంది

Yuganiki Okkadu :  మరో క్లాసిక్ సినిమా రీ రిలీజ్ అవుతోంది
X

2005 సంవత్సరం తర్వాత ఓ ఐదేళ్ల పాటు తమిళ్ సినిమా తెలుగు సినిమాను ఓ రకంగా శాసించిందనే చెప్పాలి. అప్పట్లో తమిళ్ నుంచి ఓ డబ్బింగ్ సినిమా వస్తోందంటే తెలుగులో స్టార్ హీరోలు కూడా ఇబ్బంది పడ్డ సందర్భాలు చూశాం.ఆ ప్రభావం తగ్గుతున్న టైమ్ లో వచ్చిన సినిమా యుగానికి ఒక్కడు. 2010లో సంక్రాంతి టైమ్ లో జనరవి 14న విడుదలైన ఈ చిత్రానికి థియేటర్స్ లో ఆశించినంత పెద్ద రిజల్ట్ రాలేదు. అప్పట్లో దర్శకుడుగా సూపర్ ఫామ్ లో ఉన్న సెల్వ రాఘవన్ క్రియేట్ చేసిన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ కు పూర్తిగా అర్థం కాలేదు. తమిళనాడులో చారిత్రక కథ ఆధారంగానే రూపొందించినా అక్కడా బ్లాక్ బస్టర్ కాలేదు. బట్ కొన్నాళ్ల తర్వాత ఈ మూవీలోని గ్రాఫిక్స్ కు, సెల్వ రాఘవన్ రైటింగ్ కు, కార్తీ, రీమా సేన్, ఆండ్రియా జెర్మియా, పార్తీబన్ పాత్రలకు ఫిదా అయిపోయారు. రిలీజ్ టైమ్ లో హిట్ కాలేదు కానీ.. చాలా సినిమాల్లాగే తర్వాత కల్ట్ స్టేటస్ ఇచ్చేశారు. ఈ సినిమాకు సీక్వెల్ కావాలని సెల్వ రాఘవన్ ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు. బట్ ఆ బడ్జెట్ ను దర్శకుడు ఇప్పుడు హ్యాండిల్ చేయగలడా అనే ప్రశ్నలూ ఉన్నాయి. పైగా ఫామ్ లో లేడు.

సీక్వెల్ లేకపోయినా యుగానికి ఒక్కడును మళ్లీ విడుదల చేస్తున్నారు. మార్చి 14న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రైమ్ షో ఫిల్మ్స్ వాళ్లు ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, యూఎస్ లో తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ఇండియానా జోన్స్ లాంటి అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ ఇది. ఎక్కడా బోర్ కొట్టదు. హీరోయిన్ల అందాల ప్రదర్శన కాస్త శ్రుతి మించినట్టు అనిపించినా.. అడుగడునా వచ్చే గండాలతో వీరి ప్రయాణం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మరి ఈ రీ రిలీజ్ తో ఈ మూవీ కొత్త రికార్డులేమైనా క్రియేట్ చేస్తుందేమో చూడాలి.

Tags

Next Story