టాలీవుడ్ మరో క్లియరెన్స్ సేల్.. ఏకంగా పది సినిమాలు

టాలీవుడ్ మరో క్లియరెన్స్  సేల్.. ఏకంగా పది  సినిమాలు
X

ఫ్రైడే వచ్చిందంటే చాలు.. కొత్త సినిమా పోస్టర్స్ తో థియేటర్స్ కళకళలాడతాయని అందరికీ తెలుసు. కానీ కొన్నాళ్లుగా లెక్కలేనన్ని సినిమాలు విడుదలవుతున్నాయి కానీ థియేటర్స్ మాత్రం వెలవెలబోతున్నాయి. అన్నీ చిన్న సినిమాలే కావడం ఓ కారణమైతే.. వచ్చే వాటిలో ఏదీ ఆకట్టుకోలేకపోతుండటం మరో కారణం. దీంతో ఆడియన్స్ అసలు థియేటర్స్ వైపు కూడా చూడటం లేదు. అయినా అదేదో క్లియరెన్స్ సేల్ లా ఇబ్బడిముబ్బడిగా సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. గత వారం అరడజను మూవీస్ రిలీజ్ అయితే ఒక్కటీ హిట్ అనిపించుకోలేదు. ఈ వారం ఏకంగా 10 సినిమాలు విడుదలవుతున్నాయి. వీటిలో రెండు రీ రిలీజ్ లు కూడా ఉండటం విశేషం అయితే అవి మాత్రమే అట్రాక్టివ్ గా ఉండటం మరో విశేషం.

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే ఈ ఆగస్ట్ 9న. ఈ సందర్భంగా ఆయన నటించిన సూపర్ హిట్ మూవీ మురారిని రీ రిలీజ్ చేస్తున్నారు. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ జెనరేషన్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు. తర్వాత కాస్త పేరున్న, ప్రమోషన్ చేసుకున్న సినిమా అంటే కమిటీ కుర్రాళ్లు.

నిహారిక కొణెదల నిర్మాతగా మారి రూపొందించిన సినిమా ఇది. అంతా కొత్తవాళ్లే నటించారు. ఇప్పటి వరకూ విడుదలైన రెండు ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. టైటిల్ కు భిన్నంగా ఓ బలమైన కంటెంట్ తో ఈ మూవీ రూపొందినట్టు అర్థం అవుతోంది.

దీంతో పాటు అనసూయ, జగపతిబాబు వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటించిన సింబా.. టాలీవుడ్ లో చాలామంది కమెడియన్స్ నటించిన భవనం వంటి మూవీస్ శుక్రవారం విడుదల కాబోతున్నాయి.

ఇవి కాక ఇప్పటి వరకూ పెద్దగా ప్రమోషన్స్ లోనూ కనిపించని కేస్ నెంబర్ 15, సంఘర్షణ, ల్యాండ్ మాఫియా,పాగల్ కాదల్ వంటి మూవీస్ విడుదలవుతున్నాయి. వీటితో పాటు బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ నటించిన తుఫాన్ అనే డబ్బింగ్ సినిమా కూడా బరిలో ఉంది. విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్ గా నటించిన హిట్ మూవీ సూపర్ డీలక్స్ ను రీ రిలీజ్ చేస్తున్నారు. సో.. మొత్తంగా పది సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి ఈ పదిలో కనీసం రెండు మూడైనా హిట్ టాక్ తెచ్చుకుంటాయా లేదా అనేది చూడాలి.

Tags

Next Story