Vijay Sethupathi : పూరీ జగన్నాథ్ సెన్సేషన్స్ కంటిన్యూస్

అస్సలు ఫామ్ లో లేడు అనుకుంటోన్న టైమ్ లో పూరీ జగన్నాధ్ కొత్త ప్రాజెక్ట్ తో అందరికీ షాక్ ఇచ్చాడు. సౌత్ మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ అయిన విజయ్ సేతుపతి హీరోగా అతనో సినిమా అనౌన్స్ చేశాడు. మొదట రూమర్ అనుకున్నారు. తర్వాత కన్ఫార్మ్ అని తెలిసి ఆశ్చర్యపోయారు. అందరూ ఆ ఆశ్చర్యంలో ఉండగానే ఈ ప్రాజెక్ట్ లోకి టబును తీసుకుని షాక్ ఇచ్చాడు. స్టార్ కాస్ట్ మాత్రమే కాదు.. వీళ్లు మోస్ట్ టాలెంటెడ్ కావడం.. ఈ చిత్రానికి బెగ్గర్ అనే టైటిల్ పెట్టడం చూస్తే పూరీ జగన్నాధ్ ఈ సారి ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడని పక్కాగా ఫిక్స్ అయిపోతున్నారు ఆడియన్స్.
ఈ చిత్రాన్ని కేవలం 60 రోజుల్లో పూర్తి చేయబోతున్నాడు నాని. ఆ మేరకు ఆర్టిస్టులకు ప్రామిస్ కూడా చేశాడు. పూరీకి ఇదేమంత పెద్ద టాస్క్ కాదు. కావాలంటే అంతకంటే తక్కువ రోజుల్లోనే షూటింగ్ చేసేయగలడు. అది అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఇక లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ లోకి మరో టాలెంటెడ్ బ్యూటీని తీసుకున్నాడు. తనెవరో కాదు.. నివేదా థామస్. నివేదా చివరగా 35 చిన్న కథ కాదు అనే చిత్రంతో ఆకట్టుకుంది. ఆ సినిమా కోసం తను బాగా లావెక్కింది కూడా. మరి ఈ చిత్రానికి తగ్గుతుందా లేక ఆ ఫిజిక్ తోనే కనిపిస్తుందా అనేది చూడాలి.
ఇక రెండు నెలల్లోనే చిత్రీకరణ పూర్తి చేసి ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి ఈ చిత్రాన్ని ఈ యేడాది చివర్లోనే విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు పూరీ జగన్నాథ్. ఇయర్ ఎండింగ్ వరకూ ఈ మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయితే 2006 పూరీకి మరో బిజీ ఇయర్ అవుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com