Sreeleela : పాపం శ్రీలీల.. ఇదీ పాయే

Sreeleela  :  పాపం శ్రీలీల.. ఇదీ పాయే
X

ధమాకా బ్యూటీ శ్రీలీలకు కొన్నాళ్లుగా లక్ కలిసి రావడం లేదు. తన వరకూ బానే చేస్తోంది. డ్యాన్సులు ఇరగదీస్తుంది. ఛలాకీగా కనిపిస్తుంది. ప్రమోషన్స్ లోనూ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ వస్తోంది. బట్ కంటెంట్ లేని సినిమాలకు కమిట్ అవుతుండటం వల్ల కమర్షియల్ గా అన్ని సినిమాలూ పోతున్నాయి. దీంతో అమ్మడి ఖాతాలో అధికంగా ఫ్లాపులే ఉన్నాయి. ఇప్పటి వరకూ చేసిన వాటిలో రెండో సినిమా ధమాకా, భగవంత్ కేసరి, గుంటూరు కారం మాత్రమే హిట్స్. మిగతా అన్నీ ఫట్టు. ముఖ్యంగా తెలుగులో.

ధమాకా తర్వాత ఆఫర్స్ ఆ సౌండ్ లాగానే వచ్చాయి. బట్ అంతే వేగంగా తుస్సుమన్నాయి. స్కంద, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్, తాజాగా రాబిన్ హుడ్. ఇదైతే మరీ దారుణం అంటున్నారు చూసిన వాళ్లంతా. మధ్యలో పుష్ప 2లో చేసిన ఐటమ్ సాంగ్ కెరీర్ కు ఏమంత ఉపయోగపడటం లేదు అని క్లియర్ గా అర్థం అవుతోంది. తెలుగులో తన పని ఐపోయినట్టే అనుకుంటున్నారు. కాకపోతే హిందీలో అనురాగ్ బసు డైరెక్షన్ లో రూపొందుతోన్న మూవీపై అంచనాలున్నాయి. అలాగే తమిళ్ లో శివకార్తికేయన్ సరసన చేస్తోన్న పరాశక్తిపై హోప్స్ పెట్టుకుంది. ఇటు తెలుగు నుంచి రవితేజ సరసన మరోసారి చేస్తోన్న మాస్ జాతరపై బోలెడు ఆశలు పెట్టుకుంది. కానీ రవితేజ సినిమా అంటే అస్సలు గ్యారెంటీ లేదిప్పుడు.

ఏదేమైనా తారాజువ్వలా ఎగసిన శ్రీ లీల ఆ జువ్వలాగే ఒకట్రెండు విజయాలకే కింద పడిపోయింది. నిజానికి రాబిన్ హుడ్ మరీ ఇంత పెద్ద డిజాస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. అంతకు ముందు నితిన్ తో చేసిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ పోయినా ఇది కాపాడుతుందనుకుంటే.. ఇది అంతకంటే ఎక్కువ నష్టం తెచ్చింది. మరిప్పుడీ బ్యూటీని తెలుగులో ఆదుకునేదెవరో చూడాలి మరి.

Tags

Next Story