Pawan Kalyan : హరిహర వీరమల్లు తగ్గేదే లే అంటున్నాడుగా

Pawan Kalyan :  హరిహర వీరమల్లు తగ్గేదే లే అంటున్నాడుగా
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు మూవీపై అంచనాలున్నాయా అంటే పూర్తిగా లేవు అని చెప్పాలి. ఎందుకంటే ఫ్యాన్స్ ఈ మూవీ కంటే ‘ఓ.జి’ కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ముందు ఓజి వస్తేనే బావుండు అనే భావన వారిలో ఉంది. అందుకే ఈ మూవీ అప్డేట్స్ ను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మార్చి 28న హరిహర వీరమల్లు విడుదల కాబోతోందనే వార్త గతంలోనే చెప్పారు. కానీ పోస్ట్ పోన్ అయిందని.. సమ్మర్ తర్వాతే విడుదలవుతుందనీ చాలా ఊహాగానాలు వినిపించాయి. అందుకు కారణం ఆ డేట్ కు నితిన్, వెంకీ కుడుముల కాంబోలో రూపొందిన రాబిన్ హుడ్ ను అనౌన్స్ చేయడం.. ఆ తర్వాతి రోజు సితార బ్యానర్ లో రూపొందిన ‘మ్యాడ్2’ను విడుదల చేస్తుండటమే. కానీ హరిహర నిర్మాత ఏఎమ్ రత్నం మాత్రం ఎక్కడా తగ్గేదే లే అన్నట్టుగా తన సినిమా పోస్ట్ పోన్ కాలేదు అని మార్చి 28 పోస్టర్స్ ను ఆపడం లేదు.

ఇక హరిహర వీరమల్లు నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ కు మంచి స్పందనే వచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాడటం మరింత ప్లస్ అయింది. తాజాగా సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ ఫోక్లోర్(జానపద) సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. దీంతో పాటు మళ్లీ మార్చి 28 విడుదల అనే డేట్ అలాగే ఉంచారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉందని కూడా చెప్పారు. అంటే రిలీజ్ ఆగడం లేదు అని ఇన్ డైరెక్ట్ గా చెప్పడమా లేక ఇలా పవన్ పై ఒత్తిడి పెంచడమా అనేది తెలియదు కానీ.. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఫ్యాన్స్ లోనూ చాలా సందేహాలున్నాయనేది వాస్తవం.

Tags

Next Story