Puri Jagannath : పూరీ జగన్నాథ్ ఖాతాలో మరో హీరో

దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్వేషణ కొనసాగుతూనే ఉంది. అదే టైమ్ లో రూమర్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు ఇది రూమర్ కాకపోవచ్చు అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. డబుల్ ఇస్మార్ట్ తో మరో డిజాస్టర్ చూసిన పూరీ జగన్నాథ్.. మరో సినిమా స్టార్ట్ చేయడానికి నానా తంటాలు పడుతున్నాడు. అందుకు కారణం అతని పేరు చెబితే హీరోలు పారిపోతున్నారు అంటున్నారు. చాలాకాలంగా ఒకే తరహా కథ, కథనాలతో విసిగిస్తున్నాడు పూరీ. నిజానికి ఇవి స్టార్ట్ అయినప్పుడు అవే చాలా కొత్త కథలు. బట్ అవే కథలు అనేక సార్లు చెబితే మొనాటనీ వస్తుంది కదా. అలాగే పూరీ డైరెక్షన్ పైనా జనానికి మొహం మొత్తింది. సో.. ఇప్పుడు మరో మూవీ కోసం హీరోల అన్వేషణ సాగిస్తున్నాడు.
రీసెంట్ గా పూరీ, గోపీచంద్ కాంబోలో గోలీమార్ 2 తీస్తున్నారు అన్నారు. తర్వాత నాగార్జున, అఖిల్ అక్కినేని పేర్లు వినిపించాయి. బట్ వీళ్లెవరూ అతని కథలు ఇంకా వినలేదు. విని నచ్చితే ఓకే అయితే పూరీకే అందరికంటే ఎక్కువ సంతోషం. ఇక లేటెస్ట్ గా పూరీ పేరుతో మరో హీరో కనిపిస్తున్నాడు. అయితే ఇదే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే ఆ హీరో విజయ్ సేతుపతి. క్యారెక్టర్ నచ్చితే చాలు ఏ పాత్రైనా చేసుకుంటూ వెళుతూ మోస్ట్ బిజీయొస్ట్ ఆర్టిస్ట్ గా ఉన్నాడు విజయ్ సేతుపతి. అప్పుడప్పుడూ హీరోగానూ అద్భుతమైన కథలతో హిట్స్ కొడుతున్నాడు. అలా ఇప్పుడు పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో అతనో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ.. నిజమే అయితే మాత్రం ఖచ్చితంగా పూరీ స్క్రిప్ట్ విరిగి నేతిలో పడ్డట్టే. ఎందుకంటే ఇదే కథతో రెండు భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకునే అవకాశం వస్తుంది కదా. మరి ఇదైనా నిజమవుతుందేమో చూద్దాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com