Vijay Devarakonda : విజయ్ కోసం మరో కన్నడ బ్యూటీ

Vijay Devarakonda : విజయ్ కోసం మరో కన్నడ బ్యూటీ
X

విజయ్ దేవరకొండ దూకుడుగా ఉన్నాడు. సినిమాల రిజల్ట్స్ తో పనిలేకుండా దూసుకుపోతూనే ఉన్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో 12వ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో ఇప్పటి వరకూ చేయని రోల్ చేస్తున్నాడని చెబుతున్నారు. ఆ మధ్య పోలీస్ యూనిఫామ్ లో ఉన్నపోస్టర్ ఒకటి వచ్చింది. అయితే అతను ఓ ఏజెంట్ పాత్రలో కనిపిస్తాడు అనే టాక్ కూడా ఉంది. ఈ మూవీ తర్వాత రాజావారు రాణివారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యాడు. ఇది కూడా విజయ్ కి ఫస్ట్ టైమ్ రోల్. రాయలసీమ రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ ఎంటర్టైనర్. దీని తర్వాత ఒప్పుకున్న మూవీ రాహుల్ సాంకృత్యన్ ది. ఈ ఇద్దరూ కలిసి ఆల్రెడీ టాక్సీవాలా అనే మూవీ చేశారు. ఇది పీరియాడికల్ ఫిక్షన్ డ్రామా అంటున్నారు. అయితే రవికిరణ్ కంటే ముందు రాహుల్ మూవీనే చేస్తాడు అనే టాక్ కూడా వస్తోంది. ఈ ప్రాజెక్ట్ ను మైత్రీ మూవీస్ వాళ్లు ప్రొడ్యూస్ చేయబోతున్నారు.

ఇక రవి కిరణ్ కోలా మూవీలో హీరోయిన్ గా లేటెస్ట్ కోలీవుడ్ సెన్సేషన్ రుక్మిణి వసంత్ ను సెలెక్ట్ చేసుకున్నారు. కన్నడలో సప్త సాగరాలు దాటి అనే రెండు భాగాల సినిమాతో రుక్మిణి ఓవర్ నైట్ హాట్ ఫేవరెట్ అయింది. తను గౌతమ్ మూవీలోనే నటిస్తుందనే టాక్ వచ్చినా.. అందులో భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారు. సో.. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే మూవీ కాబట్టి చూడగానే కాస్త ఇన్నోసెంట్ గా కనిపించే రుక్మిణి వసంత్ బాగా సూట్ అవుతుందనుకోవచ్చు. రవికిరణ్ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

మొత్తంగా ఒకటీ రెండు తెలుగు సినిమాల తర్వాత విజయ్ తో జోడీ కట్టిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా కెరీర్ ఎక్కడికో పోయింది. ఇప్పుడు రుక్మిణి కూడా విజయ్ కంటే ముందు రవితేజ సరసన నటించబోతోంది. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. మరి ఈ బ్యూటీ కెరీర్ ను ఎక్కడికి తీసుకువెళతాడో ఈ రౌడీ స్టార్.

Tags

Next Story