Akhanda 2 : అఖండ 2 లో మరో లక్కీ హీరోయిన్

Akhanda 2 :  అఖండ 2 లో మరో లక్కీ హీరోయిన్
X

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ కు పూనకాలే అని వీరి కలయికలో వచ్చిన మూడు సినిమాలూ నిరూపించాయి. ఈ మధ్య స్కందతో బోయపాటి మళ్లీ వెనకబడ్డాడు. బట్ బాలయ్య మాత్రం డాకూ మహారాజ్ తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. డాకూ మహారాజ్ షూటింగ్ లో ఉండగానే వీరి కాంబోలో అఖండ 2 తాడవం అనౌన్స్ అయింది. రీసెంట్ గా కుంభమేళాలో కొంత భాగం చిత్రీకరణ కూడా చేసి వచ్చాడు బోయపాటి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోన్న ఈ మూవీలో ఫస్ట్ పార్ట్ లో ఉన్న పాత్రలు చాలా వరకూ రిపీట్ కాబోతున్నాయి. బాలయ్య మళ్లీ డ్యూయొల్ రోల్ చేస్తాడు. అందులో అఘోరా పాత్ర అలాగే ఉంటుంది. ఈ సారి తాండవం కాబట్టి మరింత పవర్ ఫుల్ గా ఉండబోతోందని చెబుతున్నారు. ఇక థమన్ అయితే ఓ రేంజ్ లో హైప్ చేస్తున్నాడీ చిత్రానికి. నిజానికి ఫస్ట్ పార్ట్ కు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ హార్ట్ లా నిలిచిందని చెప్పాలి.

ఇక ఫస్ట్ పార్ట్ లో బాలయ్య సరసన ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటించింది. తను మళ్లీ ఆపాత్రలోనే కంటిన్యూ కాబోతోంది. అయితే ఈ చిత్రంలో మరో లక్కీ హీరోయిన్ ను కూడా తీసుకున్నారట. కొన్నాళ్లుగా టాలీవుడ్ లో తను ఏ సినిమా చేసినా హిట్టే అనే ముద్ర పడిన సంయుక్త మీనన్ అఖండ 2లో నటించబోతోందట.

సంయుక్తకు ఎన్ని హిట్స్ ఉన్నా.. తనకెందుకో హీరోయిన్ గా రేంజ్ మారడం లేదు. ఇంకా అండర్ రేటెడ్ గానే కనిపిస్తోంది. ఇది తనను కొంత డిజప్పాయింట్ చేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఆమె లైనప్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. శర్వానంద్ సరసన నారీ నారీ నడుమ మురారి, స్వయంభు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన హైందవతో పాటు మరో మూవీ కూడా చేస్తోంది. ఇప్పుడు అఖండ 2తో 4వ సినిమా తెలుగులోనే తన ఖాతాలో ఉంది. మొత్తంగా ఈ టాలెంటెడ్ బ్యూటీతో బాలయ్య రొమాన్స్ చేస్తాడా లేక ఇంకేదైనా ప్రత్యేక పాత్రతో తను కనిపించబోతోందా అనేది చూడాలి.

Tags

Next Story