Dacoit Movie : డెకాయిట్ నుంచి మీనింగ్ ఫుల్ సాంగ్ రిలీజ్

Dacoit Movie :  డెకాయిట్ నుంచి మీనింగ్ ఫుల్ సాంగ్ రిలీజ్
X

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మూవీ డెకాయిట్. ఈ మూవీపై ముందు నుంచి మంచి పాజిటివ్ బజ్ ఉంది. అడివి శేష్ నుంచి ష్యూర్ షాట్ లా అనిపించింది. ఇప్పటి వరకు వచ్చిన టీజర్, రెండు పాటలు బావున్నాయి అనే టాక్ తెచ్చుకున్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ తర్వాత అంచనాలు మొదలయ్యాయి. ఇక ఈ నెల 10న విడుదల కాబోతోన్న ఈ మూవీ నుంచి తాజాగా మరో పాట విడుదల చేశారు. ఈ పాట మీనింగ్ ఫుల్ గా సాగే కథనాన్ని కూడా ముడిపెడుతూ ఉండేలా ఉంది. టైటిల్ డెకాయిట్ అయినా ఇదో కంప్లీట్ లవ్ స్టోరీ అని ముందు నుంచీ చెబుతున్నారు వీళ్లు. అది నిజమే అనిపించేలా ఉంది ఈ పాట. పాట అర్థవంతంగా ఉంది.

‘కలిసుంటేనే ప్రేమంటారా.. నిజం అంటేనే కల అంటారా.. ఏ రోజైతే వదిలివేసి వెళ్లావో నా ప్రేమనీ.. ఆ రోజు వదిలేసుకున్నా నా ఆశనీ.. నమ్మేదెలా నా కళ్ల ముందుంది నువ్వేనని.. పొరపాటుగా కలగంటున్నా నా నిన్ననే.. ’ అంటూ సాగే పాట ఇది. ఇద్దరి మధ్య అనుకోని ఎడబాటు వస్తుంది. ఆ ఎడబాటులో హీరో తన ఫీలింగ్స్ ను పంచుకుంటూ ఉంటాడు. చాలా డెప్త్ ఉన్న పాటగా కూడా అనిపిస్తోంది. ఫస్ట్ సాంగ్ తర్వాత ఈ పాట చాలా బాగా నచ్చేలా ఉంది. భీమ్స్ సిసిరోలియో ఈ తరహా మంచి పాటను ట్యూన్ చేయడం బావుంది. శ్రీరామ చంద్ర పాడిన ఈ పాట సింప్లీ సూపర్బ్ గా ఉంది. అతను పాడిన విధానం చాలా చాలా బావుంది. మొత్తంగా ఈ పాటతో మూవీ మరోసారి ఆకట్టుకుంది అని చెప్పాలి.

Tags

Next Story