Sonu Sood: కొడుకును కోల్పోయిన మరో తల్లి: సోనూసూద్ ఎమోషనల్ పోస్ట్

Sonu Sood: పంజాబీ సింగర్ సిద్ధూ ముసేవాలా దారుణ హత్యకు గురవడం యావత్ ప్రపంచాన్ని కలిచి వేసింది. పట్టుమని 30 ఏళ్లు కూడా లేని అతడిని కాల్చి చంపి తన తల్లిని కడుపు కోతకు గురిచేశారు. బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ..
కొడుకును కోల్పోయిన తల్లికి ఎంత బాధ ఉంటుందో ఊహించడం కూడా కష్టం. పంజాబీ సింగర్ సిద్ధూ ముసేవాలా తల్లి ఈ బాధను అనుభవిస్తోంది. ఈ సమయంలో సిద్ధూ తల్లి గుండెల్లో ఏముందో చెప్పలేం. సిద్ధూ మృతితో ఆయన కుటుంబమే కాదు యావత్ దేశం షాక్‌కు గురైంది.
సోనూ సూద్ కూడా సిద్ధూ ముసేవాలా మరణం తన గుండెను పిండేసిందని బాధను వివరిస్తూ పోస్ట్ చేశారు. నటుడు సిద్ధూ ముసేవాలాను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ వార్త ఎవరినైనా కంట నీరు పెట్టిస్తుంది.
సోనూ సూద్ తన తల్లితో కలిసి ఉన్న సిద్ధూ ముసేవాలాతో ఉన్న ప్రత్యేక చిత్రాన్ని పంచుకున్నారు. ఫోటోలో, సిద్ధు తన తల్లికి ఏదో చూపిస్తున్నాడు. సిద్ధూని, అతని తల్లిని చూస్తే, వారి మధ్య బలమైన బంధం, ప్రేమ ఎంత గొప్పదో అంచనా వేయవచ్చు. హృదయాన్ని హత్తుకునే ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ, సోనూ సూద్ క్యాప్షన్‌లో ఇలా రాశాడు – మరో తల్లికి కొడుకు పోయాడు #RIPSidhuMoosewala.
కానీ అతను తన తల్లి యొక్క ప్రతి శ్వాసలో, జ్ఞాపకశక్తిలో ఎల్లప్పుడూ సజీవంగా ఉంటాడు. 'మీరు నన్ను తప్పుగా భావించవద్దు', సిద్ధూ మరణం తర్వాత వైరల్ అయిన చివరి Instagram పోస్ట్ ఇది. అని సోనూసూద్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
సిద్ధు తన కెరీర్‌లో అద్భుతమైన పాటలను అందించాడు. అతడి పాటలతో పాటు అతడి శైలి కూడా అభిమానులకు మరింత చేరువ చేసింది. సిద్ధూ తను పాడిన చాలా పాటలలో తుపాకీని ఉపయోగించే వాడు. ఇది కూడా సంచలనం సృష్టించింది. అయితే అభిమానులలో అతడు మంచి క్రేజిని సంపాదించుకున్నాడు.
एक और माँ का बेटा चला गया 💔#RIPSidhuMoosewala pic.twitter.com/QmB2hkcelr
— sonu sood (@SonuSood) May 30, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com