Kajal Aggarwal : కాజల్ కు బాలీవుడ్ నుంచి మరో అవకాశం..?
కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ను ఏలేసింది. సౌత్ లో తెలుగుతో పాటు తమిళ్ లోనూ టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కానీ అదేంటో తనే కాదు ముంబై నుంచి వచ్చిన బ్యూటీస్ అంతా ఇక్కడ ఫేమ్ సంపాదించడం బాలీవుడ్ లో పాగా వేయాలనుకోవడం అనే ప్రయత్నాలు ఎప్పటి నుంచో చూస్తున్నాం. కాజల్ కూడా ఇక్కడ టాప్ లో ఉండగా బాలీవుడ్ లో కొన్ని ప్రయత్నాలు చేసింది. బట్ అన్నీ ఫ్లాప్ అయ్యాయి. చివరికి ఇక్కడ ఎప్పుడూ యాక్సెప్ట్ చేయని లిప్ లాక్ లు, ఇంటిమేట్ సీన్స్ కూడా బాలీవుడ్ లో చేసింది. అయినా సినిమాలు పోవడంతో అమ్మడి కష్టం వృథా అయింది.
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. పెళ్లి, బిడ్డ తర్వాత మళ్లీ మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. భగవంత్ కేసరిలో రెగ్యులర్ హీరోయిన్ కాదు. సత్యభామలో లీడ్ రోల్ చేసింది కానీ పెద్ద హిట్ కాదు. ప్రస్తుతం కాజల్ బాలీవుడ్ లో ఉమా అనే మూవీ చేస్తోంది. తమిళ్ లో భారతీయుడు 3 చాలా వరకూ కంప్లీట్ అయింది. కన్నప్పలో ఓ గెస్ట్ రోల్ చేసింది. ఈ టైమ్ లో తనకు మరో భారీ ఆఫర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా సల్మాన్ ఖాన్ సరసన.
సల్మాన్ ఖాన్ హీరోగా తమిళ్ డైరెక్టర్ మురుగదాస్ సింకిందర్ అనే మూవీ చేస్తున్నాడు. టాప్ నాచ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న సినిమా ఇది. సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం కాజల్ అగర్వాల్ ను తీసుకోబోతున్నారని బి టౌన్ టాక్. కాజల్ గతంలో మురుగదాస్ డైరెక్షన్ లో రూపొందిన తుపాకీ మూవీలో నటించింది. అప్పటి నుంచి వీరి మధ్య మంచి బాండ్ ఉంది. ఆ కారణంగా తను సికిందర్ లోకి ఎంట్రీ ఇస్తోందా లేక.. ఈ పాత్రకు తను బావుంటుందని తీసుకున్నారో లేదో కానీ.. ఇంకా కాజల్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com