Pinaka Title Teaser : కన్నడ నుంచి మరో ప్యాన్ ఇండియా మూవీ.?

Pinaka Title Teaser :  కన్నడ నుంచి మరో ప్యాన్ ఇండియా మూవీ.?
X

బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా మార్కెట్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లింది కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కేజీఎఫ్. ఈ మూవీ తర్వాత అదో ట్రెండ్ గా మారింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో ఏకంగా గ్లోబ్ మొత్తానికి పరిచయం అయ్యాడు. అటు కన్నడ నుంచి వచ్చిన కాంతార మరో ప్యాన్ ఇండియా మూవీగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. అదే టైమ్ లో శాండల్ వుడ్ కు ప్యాన్ ఇండియా సినిమా అనే పిచ్చి పట్టుకుంది. ఈ క్రమంలో వచ్చిన విక్రాంత్ రోణా, రాబర్ట్, యూఐ, మాక్స్ వంటి మూవీస్ ఆ హోదాను అందుకోలేకపోయాయి. బట్ ఇప్పుడు మరో సినిమా కన్నడ నుంచి రాబోతోంది. తాజాగా ఈ మూవీ టైటిల్ టీజర్ అంటూ ఒక వీడియో విడుదల చేశారు. ఇది చూస్తే ష్యూర్ గా ప్యాన్ ఇండియా సినిమా అవుతుందనిపిస్తోందనే కమెంట్స్ తెచ్చుకుంటోంది.

శాండల్ వుడ్ లో గోల్డెన్ స్టార్ గా మంచి క్రేజ్ ఉన్న హీరో గణేష్. అతను హీరోగా రూపొందుతోన్న ఈ మూవీ ‘పినాక’. పినాక అంటే శివుడి ధనుస్సు. అందుకే శివుడిని పినాకపాణి అని కూడా అంటారు.

ఈ టీజర్ చూస్తే శివుడి పాత్రను తలపిస్తోంది. స్మశానంలోనే నివసిస్తూ అక్కడి ఆత్మలన్నీ తన ఆధీనంలో ఉంచుకున్న ఓ వ్యక్తి కథలా కనిపిస్తోంది. అదే సమయంలో రుద్రశక్తికి, క్షుద్రశక్తికి మధ్య సాగే పోరాటం అని కూడా తెలుస్తోంది. అయితే ఇది కల్పిత కథ కాదు.. శతాబ్దాలుగా జనం నోళ్లలో నానుతోన్న ఒక నిజమైన కథ అంటూ టీజర్ లోని డైలాగ్స్ లో వినిపిస్తోంది. గణేష్ గెటప్ బావుంది. శివుడికి దగ్గరగా కనిపిస్తోంది. మేకింగ్, టేకింగ్, విఎఫ్ఎక్స్,గ్రాఫిక్స్ క్వాలిటీతో కనిపిస్తున్నాయి. చూస్తుంటే ఇది శాండల్ వుడ్ నుంచి మరో ప్యాన్ ఇండియా సినిమా అవుతుందని బలంగా అనిపిస్తోంది. తెలుగు నిర్మాతలైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లు నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ధనంజయ డైరెక్ట్ చేస్తున్నాడు. మొత్తంగా టైటిల్ టీజర్ తోనే ఎంటైర్ ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాబ్ చేసిందీ మూవీ. మరి సినిమాగా ఎలా ఉంటుందో చూడాలి.

Tags

Next Story