దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డికి మరో అరుదైన అవకాశం

దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డికి మరో అరుదైన అవకాశం
సోని తన ఓటీటీ విభాగం "సోని లివ్" తెలుగు కంటెంట్ హెడ్ గా మధుర శ్రీధర్ రెడ్డిని నియమించుకుంది.

టాలీవుడ్ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డికి మరో అరుదైన అవకాశం దక్కింది. అంతర్జాతీయ ఎంటర్ టైన్ మెంట్ లో లెజెండ్ గా పేరున్న కంపెనీ సోని తన ఓటీటీ విభాగం "సోని లివ్" తెలుగు కంటెంట్ హెడ్ గా మధుర శ్రీధర్ రెడ్డిని నియమించుకుంది. తమ ఓటీటీలో వర్సటైల్ తెలుగు కంటెంట్ ను పెంచేందుకు శ్రీధర్ రెడ్డి అనుభవం, ప్యాషన్ బాగా ఉపయోగపడతాయని "సోని లివ్" మేనేజ్ మెంట్ గట్టి నమ్మకంతో ఉంది.

సోని ఎంటర్ టైన్ మెంట్ టెలివిజన్, సోని లివ్ కంటెంట్ హెడ్ ఆశిష్ గోల్వాకర్ మాట్లాడుతూ..."సోని లివ్" తెలుగు కంటెంట్ హెడ్ గా మధుర శ్రీధర్ రెడ్డి గారు మాతో జాయిన్ అవడం సంతోషంగా ఉంది. తనకున్న అనుభవంతో వీక్షకులకు నచ్చే వైవిధ్యమైన కంటెంట్ ను ఆయన "సోని లివ్" కు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. అన్ని వర్గాల వీక్షకులు ఇష్టపడేలా "సోని లివ్" ను శ్రీధర్ రెడ్డి డెవలవ్ చేస్తారని నమ్మకం ఉంది అని అన్నారు.

మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. వినోద రంగంలో సోని ఒక దిగ్గజ సంస్థ. ఇలాంటి సంస్థ ఓటీటీ "సోని లివ్" తో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. తెలుగులోని వైవిధ్యమైన కంటెంట్ ను దేశవ్యాప్తంగా ఆడియెన్స్ ఆదరించేలా తీసుకొస్తాం అన్నారు.

మధుర శ్రీధర్ రెడ్డి వరంగల్ ఎన్ ఐటీ లో ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసి...ఐఐటీ మద్రాస్ లో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్ర కంపెనీల్లో పనిచేశారు. సినీ రంగం మీద ఆసక్తితో టాలీవుడ్ లో అడుగుపెట్టిన మధుర శ్రీధర్ రెడ్డి... గత 11 ఏళ్లుగా టాలీవుడ్ లో దర్శకుడిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, మ్యూజిక్ లేబుల్ ఓనర్ గా, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయనది క్రియేటివ్ జర్నీ గా చెబుతుంటారు. ఎంటర్ టైన్ మెంట్ లో మల్టీ నేషనల్ కంపెనీ సోని ఓటీటీ "సోని లివ్" లో నిర్ణయాత్మక పోస్టులోకి వచ్చిన మధుర శ్రీధర్ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమ వాసులకు మరింత చేరువ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story