Jai Bhim: 'జై భీమ్‌'కు మరో అరుదైన గౌరవం..

Jai Bhim: జై భీమ్‌కు మరో అరుదైన గౌరవం..
Jai Bhim: వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ కోర్టు డ్రామా కథ ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది.

Jai Bhim: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన హిట్ మూవీ జై భీమ్. జస్టిస్ చంద్రు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తా.సే.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో సూర్య నటించి నిర్మించిన చిత్రం జై భీమ్. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ కోర్టు డ్రామా కథ ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది.

అకాడమీ (ఆస్కార్) అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఈ సినిమాకు సంబంధించిన వీడియోను ఉంచారు. అకాడమీ యూట్యూబ్ వేదికగా ఒక తమిళ సినిమాకు సంబంధించిన వీడియోను ఉంచడం ఇదే తొలిసారి. దీంతో చిత్ర బృందంతో పాటు సూర్య అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. జై భీమ్ ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిందని టీమ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story