Ravi Teja Mirapakay : రవితేజ నుంచి మరో రీ రిలీజ్

Ravi Teja Mirapakay :  రవితేజ నుంచి మరో రీ రిలీజ్
X

మాస్ మహరాజ్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు చేసిన సినిమాలకు రీ రిలీజ్ వాల్యూ చాలానే ఉంది. ఇప్పటికే విక్రమార్కుడు, నా ఆటోగ్రాఫ్ వంటి మూవీస్ రీ రిలీజ్ అయ్యి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరో మూవీతో వస్తున్నాడు మాస్ రాజా. విశేషం ఏంటంటే ఈ మూవీ హరీష్ శంకర్ కు ఫస్ట్ బ్లాక్ బస్టర్. అంతకు ముందు రవితేజతోనే అతను ‘షాక్’అనే మూవీ చేశాడు. జ్యోతిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా తేలింది. కొత్త ప్రయత్నంలా అనిపించినా.. అప్పటికి రవితేజ ఇమేజ్ కు పూర్తి భిన్నంగా ఉండటం మైనస్ అయింది. అయినా హరీష్ శంకర్ టేకింగ్ నచ్చి మరో అవకాశం ఇచ్చాడు రవితేజ. అలా వచ్చిందే ఈ మిరపకాయ్.

మాస్ రాజా సరసన రిచా గంగోపాధ్యాయ్, దీక్షా సేథ్ హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, నాగబాబు, అలీ, సునిల్, ఇతర కీలక పాత్రలు చేశారు.

2011 జనవరి 13న సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఓ మిషన్ కోసం హైదరాబాద్ లోని ఓ కాలేజ్ లో హిందీ లెక్చరర్ గా చేరతాడు. అతని లక్ష్యం ఏంటీ.. దాన్ని ఎలా నెరవేర్చాడు అనేది కథ. కంప్లీట్ గా రవితేజ ఇమేజ్ కు అనుగుణంగా హరీష్ రాసుకున్న కథ ఇది. అందుకే ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ కూడా సమపాళ్లలో కనిపిస్తూ.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాంటి మూవీని మళ్లీ ఈ నెల 11న విడుదల చేయబోతున్నారు. ఓ రకంగా రీ రిలీజ్ లు స్ట్రెయిట్ మూవీస్ ను ఇబ్బంది పెడుతున్న దశలో ఉన్నాం. అయినా మిరపకాయ్ కి మళ్లీ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించే సత్తా ఉందనే చెప్పాలి.

Tags

Next Story