Keerthi Suresh : కీర్తి సురేష్ పై మరో రూమర్ న్యూస్

Keerthi Suresh :  కీర్తి సురేష్ పై మరో రూమర్ న్యూస్
X

పెళ్లి తర్వాత కీర్తి సురేష్ కొత్త ప్రాజెక్ట్స్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. కానీ ఏదీ నిజం అని ఎవరూ చెప్పడం లేదు. తను మెయిన్ లీడ్ గా చేస్తోన్న రివాల్వర్ రీటా, అక్క అనే వెబ్ సిరీస్ లకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఆగిపోయాయి. అందుకు కారణాలేవైనా.. తను మాత్రం రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తూనే ఉంది. తాజాగా తన కొత్త సినిమా అప్డేట్ అంటూ మరో న్యూస్ వస్తోంది. అయితే ఇది తెలుగు సినిమా కావడం విశేషం. అదీ సూర్య సరసన.

తమిళ్ స్టార్ హీరో సూర్య ఫైనల్ గా ఫస్ట్ టైమ్ డైరెక్ట్ తెలుగు మూవీకి ఓకే చెప్పాడు. సితార బ్యానర్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు. ఆల్రెడీ ఇదే బ్యానర్ లో వెంకీ.. ధనుష్ తో సార్, దుల్కర్ తో లక్కీ భాస్కర్ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ ఇచ్చి ఉన్నాడు. అదే సూర్య ఒప్పుకోవడానికీ కారణం అనుకోవచ్చు.

ఇక ఈచిత్రంలో సూర్య సరసన హీరోయిన్ గా ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపించాయి. కాకపోతే సితార లోనే వెంకీ డైరెక్షన్ లో గతంలో కీర్తి రంగ్ దే అనే సినిమాలో నటించింది. ఆ బాండింగ్ తో వెంకీ ఈ సారి కూడా కీర్తి సురేష్ ను తీసుకుందాం అని చెప్పాడనీ.. సూర్య మూవీలో తనే హీరోయిన్ అనీ కొత్త న్యూస్ వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది సితార టీమ్ నుంచి ఎవరో ఒకరు చెబుతారా లేదా అనేది చూడటం కంటే.. అసలు ఇప్పట్లో సూర్య ఈ ప్రాజెక్ట్ లో అడుగుపెడతాడా అనేదే అసలు డౌట్.

Tags

Next Story